దక్షిణాదిన కొంచెం ఫేమస్ అయ్యి ఉత్తరాదిన నాలుగు ఆఫర్లు రాగానే తమను ఆదరించిన ఇండస్ట్రీని మర్చిపోయి అతిగా మాట్లాడతారు కొందరు నటీమణులు. గతంలో ఇలియానా, తాప్సీ వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదాస్పదం అయ్యారు. తాజాగా ఈ కోవలోకే చేరింది వర్తమాన టాప్ హీరోయిన్… పూజా హెగ్డే.
శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురంలో సినిమాలోని కాళ్ళ నేపథ్యంలోని సీన్ గురించి చెబుతూ ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై పెద్ద దుమారమే లెగిసింది.
దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారు అని అంది… మరి బాలీవుడ్ సినిమాల్లో బికినీ సీన్లు గురించి కూడా మాట్లాడాలి కదా? వారు ఏ మత్తులో ఉంటారు. ఉన్నతమైన భావాలు కలిగిన పూజా తాను అటువంటి సీన్లలో నటించను అని ఖరాకండిగా చెప్పి ఉండాల్సింది. అయితే డబ్బు కోసం ఫేమ్ కోసం అప్పుడు చెప్పింది చేసి ఇప్పుడు ఎందుకు ఈ హిపోక్రసీ?
అలాగే ఒక సినిమా గురించి మాట్లాడుతూ మొత్తం దక్షిణాదిన ఇలాగే ఉంటారని జెనెరలైజ్ చేసి మాట్లాడతాము తప్పే. బాలీవుడ్ గురించి కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు సి\ఆమె చెయ్యగలదా? తెలుగు సినిమా దక్షిణాది సినిమా అంటే ఎందుకు అంత లోకువ? దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నా అని ఆమె గుర్తుంచుకుంటే మంచిదని చాలా మంది హితవు పలుకుతున్నారు.




