పవన్ కళ్యాణ్ కు – పూనం కౌర్ కు సంబంధం ఏంటి? అంటూ కత్తి మహేష్ లేవనెత్తిన ప్రశ్నలతో ప్రస్తుతం పూనం కౌర్ ఏం చేసినా అది మీడియాకు పెద్ద వార్తగానే మారుతోంది. ఒకప్పుడు పూనం కౌర్ సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్ పెడితే అంత ప్రాధాన్యత దక్కేదేమో గానీ, ప్రస్తుతం ఏం ట్వీట్ చేసినా అది పెద్ద హంగామాగానే తయారవుతోంది. తాజాగా ఇండియాలో సాధారణ మహిళల కంటే పోర్న్ స్టార్స్ కు ఎక్కువ గౌరవం ఉందంటూ ఆవేదనను వెలిబుచ్చింది.
“దేశంలో మరెవరికీ దక్కని జీవితం, గౌరవం పోర్న్ స్టార్స్ కు దక్కుతున్నాయని, అలాగే జీవితంలో ఏదైనా సాధించాలని ముందుకొస్తున్న మహిళలను వేధించడం, అభాండాలకు గురి చేయడం పరిపాటిగా మారిందని, ఒకవేళ ఎదురుతిరిగి నిలబడితే, వారిపై అన్ని రకాలుగా దాడులు చేస్తారని, దీంతో ఆత్మాభిమానాన్ని, మనసును, శరీరాన్ని చంపుకుని బ్రతకాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ…. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దీనికి నెటిజన్ల నుండి కూడా మంచి స్పందన లభించింది.
అయితే ఈ ట్వీట్ ను ఎవరిని టార్గెట్ చేసుకుని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ పక్కన ఓ మీడియా ఛానల్ లో రాంగోపాల్ వర్మ మరియు కత్తి మహేష్ లు “గాడ్, సెక్స్, ట్రూత్” సినిమాను మరియు మియా భావాలను ఆకాశానికేత్తేస్తూ వ్యాఖ్యానిస్తుంటే…. మరో పక్కన పూనం ఈ ట్వీట్ చేసిందంటే… అందులోని పరమార్ధం తెలియనిది కాదు. పూనం ఆవేదనలో కూడా అర్ధం లేకపోలేదు. ఇండియాలో సన్నీలియోన్ కున్న క్రేజ్ మరే ఇతర హీరోయిన్ కు లేదు కదా! అదే బాటలో రేపు మియా కూడా పయనిస్తోందని పూనం ఆవేదన!
#truth pic.twitter.com/nydFPOVyEb
— Poonam Kaur Lal (@poonamkaurlal) January 17, 2018



