పోసాని కి టీడీపీ చెక్ పెట్టనుందా..?

Posani Krishna Murali

ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి అంటే సినీ నటుడు, రచయిత అని చెప్పుకునే వారు ఇప్పుడు పోసాని అంటే ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను టార్గెట్ చేస్తూ వారి కుటుంబంలోని ఆడవారి పై అసభ్యకర విమర్శలు చేసే వ్యక్తి గా, వైసీపీ అధినేత మెప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారగలిగిన నేతగా, కనీస సంస్కారం మరిచి మీడియాలో బూతుల ప్రవచనాలు వల్లించే ఒక మెంటల్ వైసీపీ నేతగా ఖ్యాతి మూటకట్టుకున్నారు.

ADVERTISEMENT

గతంలో కేవలం టీడీపీ పార్టీ ని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడునే తన టార్గెట్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంచే ఈ మేధావి ఇప్పుడు ఆ స్థానంలోకి జనసేన అధినేత పవన్ ను కూడా చేర్చి మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసినా కూడా పోసాని నోటికి చెక్ పెట్టలేకపోతున్నాయా అనే సందిగ్ధంలోకి వెళ్లిపోయారు ఇరు పార్టీల క్యాడర్.

ఇటువంటి సందర్భంలోనే టీడీపీ అన్యూహ్యంగా అడుగు ముందుకేసింది. పోసాని కృష్ణ మురళి సోదరుడు పోసాని యోగేంద్రనాథ్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాబు కూడా ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాధ్ తనకు టీడీపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని, చంద్రబాబు విజనరీ తనను ఆకట్టుకుంటుందని, ఆయన అనుభవం, ముందు చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమని, చంద్రబాబు నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ కి బాబు కి తన మద్దతు తెలియచేసారు యోగేంద్రనాథ్ పోసాని.

అన్నేమో టీడీపీ, జనసేన మీద నోటికి హద్దు అదుపు లేకుండా విరుచుకుపడుతుంటే తమ్ముడేమో బాబు కి మద్దతు పలకడంతో ఇక పోసాని విమర్శలకు యోగేంద్రనాధ్ తో చెక్ పెట్టనున్నారు అనేది టీడీపీ, జనసేన క్యాడర్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అయితే వైసీపీ మాదిరి ఆ స్థాయికి దిగజారి టీడీపీ తన పార్టీ నేతలను ప్రత్యర్థి కుటుంబాల మీద దాడికి పంపగలదా..? అంటే ఆ స్థాయికి బాబు, పవన్ దిగజారరనేది స్పష్టం. కాకపోతే పోసాని విమర్శలను తిప్పికొట్టడానికి మాత్రం యోగేంద్రనాధ్ ను కూటమి పార్టీ ఉపయోగించుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories