‘పాజిటివ్ రివ్యూస్’తో హల్చల్ చేస్తోన్న ‘ఘాజీ’

ఒక నటుడిగా విలక్షణ పాత్రలు పోషించడంలో ముందుండే హీరోలలో దగ్గుపాటి రానా ఒకరు. ‘లీడర్’తో మొదలై ‘బాహుబలి’ వరకు అనేక పాత్రలు పోషించిన రానా కెరీర్ లో మరో ప్రతిష్టాత్మక సినిమాగా “ఘాజీ” విడుదలకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాను పలువురు సినీ ప్రముఖుల కోసం మరియు పాత్రికేయుల కోసం ‘స్పెషల్ ప్రీమియర్’ షోలను ప్రదర్శించారు.

దీంతో ఈ సినిమా టాక్ విడుదలకు ముందే బయటకు వచ్చింది. ఒక నటుడిగా రానా మరింత ఎదిగేలా ఈ సినిమా ఉందని, ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో ‘అండర్ రేటెడ్’ యాక్టర్ గా రానాను చూస్తున్నారు గానీ, అంతకు మించిన సత్తా రానా సొంతంగా పలువురి సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు రానాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే సినిమా కూడా అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు.

ADVERTISEMENT

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తొలిసారిగా ‘సబ్ మెరైన్’ యుద్ధ వాతావరణం నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం నాడు విడుదలకు సిద్ధమవుతోంది. ‘బాహుబలి’ మాదిరే తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుండడంతో రానా కెరీర్ కు దోహదపడే అంశంగా పేర్కొనవచ్చు. సినీ జనాల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories