షూటింగ్ లో పాల్గొంటున్న ‘బాహుబలి’

post-shooting-the-baahubali-conclusion-prabhasగత నాలుగు సంవత్సరాలుగా ఒకే సినిమాపై ఫోకస్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు, ఇటీవలే ‘బాహుబలి’ సినిమా షూటింగ్ నుండి విముక్తి లభించింది. ఈ సినిమా విడుదలకు మరో నెల రోజుల సమయం ఉండడంతో, నాలుగు భాషల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయంగా ఈ సినిమా మరింతగా పబ్లిసిటీ అయ్యేలా ‘బాహుబలి 2’ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, మరో పక్కన ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం షూటింగ్ ప్రారంభించాడు.

అవును… సుజిత్ దర్శకత్వంలో దాదాపుగా 100 కోట్లు పైనే బడ్జెట్ తో నటించనున్న ఈ సినిమాను కూడా అన్ని భాషలలో పబ్లిసిటీ చేసేందుకు ఈ షూట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ తో ఓ టీజర్ ను కట్ చేయనున్నారు, అలాగే ఈ టీజర్ ను ‘బాహుబలి 2’ సినిమాతో పాటు ధియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం లభించి, మార్కెట్ జరుగుతుంది. ఎవరు వేసారో గానీ ఈ “స్కెచ్” అదిరిపోయిందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories