పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో తన సినిమాలలో పాఠాలు పడటం మనకు తెలిసిందే. ఆయన చివరి సారిగా అజ్ఞతవాసి సినిమాలో కొడకా కోటేశ్వరరావు అనే పాట పాడారు. తాజాగా ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరోసారి పాట పాడే అవకాశం ఉన్నట్టు సమాచారం. తన తదుపరి చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో టైటిల్ సాంగ్ ఆయన పాడతారట.
ఈ సినిమాలోని మరో హీరో రానా కూడా ఒక చరణం పడతాడని వార్తలు వస్తున్నాయి. అసలైతే అయ్యప్పనుమ్ కోశియుమ్ లో పాటలు అనేవే ఉండవు. అయితే పవన్ ఇమేజ్, ఆయన పాటలకు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కనీసం మూడు పాటలైనా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం.
అయితే ఈ పాటలతో కథను చెడగొట్టేవిలా ఉండకూడదని అయ్యప్పనమ్ కోషియం అభిమానులు ఆశిస్తారు. అయితే స్టోరీ ఫ్లోకి ఇబ్బంది కలగకుండా టైటిల్ సాంగ్, మాంటేజ్ సాంగ్, ప్రమోషనల్ సాంగ్ వంటివి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్‌లో ప్రకటించగా, వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ ఏడాది నితిన్ భీష్మాతో విజయవంతం అయిన సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తోంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రాజీపడని ఇద్దరు అహంభావం గల వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి





