అయ్యప్పనమ్ కోషియం రీమేక్ అధికారిక ప్రకటన వచ్చేసింది కానీ

Power Star - Pawan Kalyan - Ayyappanum Koshiyumపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్రతో జతకట్టనున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై బ్యాంక్రోలింగ్ చేయనున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్, అయ్యప్పనమ్ కోషియం యొక్క అధికారిక రీమేక్ అయితే మేకర్స్ దీనిని ప్రకటించలేదు.

ADVERTISEMENT

ప్రధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆ విషయాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కనీసం మల్టీస్టారర్ అన్నట్టుగా కూడా హింట్ ఇవ్వలేదు. ఏదో పవన్ కళ్యాణ్ సోలో ఫిలిం లాగా ప్రకటించేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.

అతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ కోసం సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్‌స్టార్ మరోసారి ఖాకీలో కనిపించనున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది.

తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. మలయాళంలో సక్సెస్ ఐన ఈ చిత్రం మిగతా భాషలలో ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories