షారుక్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్!

Prabhas Baahubali2 The Conclusion breaks SRK Raees youtube recordsవిడుదలై దాదాపుగా 24 గంటలు గడుస్తున్నప్పటికీ యూ ట్యూబ్ లో ‘బాహుబలి 2’ ట్రైలర్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొత్తం నాలుగు భాషల్లో విడుదల కాగా, తెలుగు ట్రైలర్ మాత్రం ఎన్నడూ చవిచూడని రికార్డులను సొంతం చేసుకుంది. ఎంతగా అంటే… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రికార్డులనే కొల్లగొట్టేటంత! అవును… ఇప్పటివరకు యూ ట్యూబ్ లో అత్యధిక క్లిక్స్ అందుకున్న షారుక్ ‘రాయిస్’ సినిమా రికార్డులను ప్రభాస్ ‘బాహుబలి 2’ అధిగమించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

ADVERTISEMENT

హిందీలో విడుదలైన షారుక్ ‘రాయిస్’ సినిమా ట్రైలర్ 24 గంటలలో 20.2 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకోగా, ప్రభాస్ ‘బాహుబలి 2’ ట్రైలర్ దాదాపుగా 22 మిలియన్ క్లిక్స్ ను అందుకుంది. ఒక జాతీయ సినిమాకుండే రేంజ్, మార్కెట్ ఏంటో అందరికీ తెలిసిందే, అలాగే ఒక ప్రాంతీయ భాష చిత్రానికి ఉండే రేంజ్ కూడా చెప్పనవసరం లేదు. కానీ, ‘బహుబలి’ వీటన్నింటికి అతీతం అని చెప్పకనే చెప్తోంది. ఇప్పటివరకు 5 లక్షల లైక్స్ అందుకుని, అందులోనూ తారాస్థాయిలో దూసుకుపోతోంది ‘బాహుబలి 2.’

ADVERTISEMENT
Latest Stories