అబ్బో… ఉత్తరాదిలో ప్రభాస్ క్రేజ్ అదిరిందిగా..!

prabhas baahubali craze in north india‘బాహుబలి’ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ను మార్చి వేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! ఎక్కడ లేని క్రేజ్ తో పాటు జాతీయ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఉత్తరాది మాస్ ప్రేక్షకుల్లో కూడా బలంగా నాటుకుపోయారన్న విషయం… ఓ ఫోటో తెలియజేస్తోంది.

సహజంగా తమ అభిమాన హీరోల ఫోటోలను ఆటోలపై ముద్రించుకోవడం తెలుగు ప్రజలకు సర్వ సాధారణమే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలను వదిలి బయటకు వెళితే తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ మన తెలుగు హీరోలపై ఉన్న అభిమానం తారసపడుతుంది. ఇక, ఉత్తరాదికి వెళితే మాత్రం అది గగనమే! మహేష్ వంటి స్టార్ హీరోల పేర్లు పరిచయం ఉన్నప్పటికీ, అది ఎక్కువగా సెలబ్రిటీల వరకే పరిమితం. సాధారణ సినీ ప్రేక్షకుల్లోకి వెళ్ళిన హీరో మాత్రం లేరు.

ADVERTISEMENT

బహుశా ఆ లోటును ప్రభాస్ తీరుస్తున్నాడెమో గానీ, సోషల్ మీడియాలో ఓ ఫోటో సందడి చేస్తోంది. మహారాష్ట్రలో తిరుగుతున్న ఒక ఆటో మీద ‘బాహుబలి’ ప్రభాస్ స్టిక్కర్ ఉండడం విశేషం. బహుశా తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు గానీ, మహారాష్ట్రలో ‘బాహుబలి’కున్న క్రేజ్ కు, ప్రభాస్ కున్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తోందని యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాది ‘బాహుబలి’ జెండా ఎగురవేసారన్న మాట.

ADVERTISEMENT
Latest Stories