సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమాను ప్రకటించిన తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ పేరు ఎలా మారుమ్రోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దర్శకుడు తాజాగా రూపొందిస్తోన్న “మెర్క్యూరీ” సినిమాను ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందుకు పురస్కరించుకుని ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.
ADVERTISEMENT
నిజానికి ఇంతకుముందు తమిళంలో విడుదల చేసిన ట్రైలర్ నే ఒక్క మార్పు కూడా చేయకుండా తెలుగులో విడుదల చేసారు. డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం తో కూడిన ఈ ట్రైలర్ కు వీక్షకులు అప్పట్లోనే ఫిదా అయ్యారు. ప్రభుదేవా ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ థ్రిల్లర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.
ADVERTISEMENT



