ప్రధాని మోడీని చాలా తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ప్రముఖ నటుడు కూడా ఒకరు. ఇటీవల ఢిల్లీలో సీజేపీ అధ్వర్యంలో జరిగిన ఆందోళనలలో ఆయన కూడా పాల్గొని మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినప్పుడే ఆ విషయం స్పష్టమైంది.
ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా వీడియోలో మరింత స్పష్టంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా మమ్మల్ని అపగలరా? అని ప్రశ్నించారు.
సర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు ఓటర్ల జాబితాలో నుంచి తన పేరు తొలగించారని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. కానీ ఆ విషయం చెప్పి చివరిగా ‘మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా.. జస్ట్ అస్కింగ్,” అంటూ ప్రకాష్ రాజ్ తన మనసులో మాట కూడా చెప్పేశారు.
ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే, బెంగళూరులో సర్ ప్రక్రియ తర్వాత ఓటు హక్కు తొలగించబడిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని.. ఇది జోక్ కదా?
నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా థియేటర్, నా కళ అంతా ఇక్కడే సాగింది. నేను ఈ నియోజకవర్గం నుంచే ఇదివరకు ఎంపీగా కూడా పోటీ చేశాను.
సరే, జోక్ బాగానే ఉంది. అన్ని అవరోధాలను అధిగమించి అసలు నా ఓటు హక్కును తిరిగి పొందడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. సరే, గేమ్ ఆన్.. కానీ ఒక్క చిన్న విషయం.. మిమ్మల్ని ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు.. కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా.. జస్ట్ అస్కింగ్,” అని ప్రకాష్ రాజ్ వీడియో పోస్ట్ చేశారు.
కానీ వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కేసు ఎదుర్కొంటున్నానని చెప్పనేలేదు. ఆ కేసులో బెంగళూరు కోర్టు తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందనే విషయం చెప్పలేదు. అప్పుడు స్వయంగా కోర్టుకి హాజరయ్యి పూచీకత్తు చెల్లించి షరతులతో కూడిన లో బెయిల్ పొందాననే విషయం ప్రకాష్ రాజ్ చెప్పకుండా దాచి పెట్టారు. ఒకవేళ ఈ విషయం కూడా చెప్పి ఉంటే సర్ ప్రక్రియలో అయన ఓటు ఎందుకు తొలగించబడిందో అందరికీ అర్ధమయ్యే ఉండేది. ఒకవేళ బెంగళూరులో తప్ప మరే రాష్ట్రంలో ఆయనకు ఓటు హక్కు లేకపోయి ఉంటే ఆ విషయం ఈ వీదియోలోనే చెప్పుకోవచ్చు కదా?
అయితే ‘ఓటర్ల జాబితాలో నుంచి తన పేరు తొలగించడం కంటే ప్రధాని మోడీని గద్దె దించకుండా ఆపగలరా?’ అంటూ ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్న కీలకం. అంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకుంటున్న వ్యతిరేక శక్తులలో ఆయన కూడా ఒకరు. అలాంటి పార్టీలు, వ్యక్తులు, శక్తులతో కలిసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రకాష్ రాజ్ పనిచేస్తున్నట్లు ఈ ఒక్క వీడియోతో స్వయంగా చాటింపు వేసుకున్నరుగా!
ఇక్కడే పుట్టా… ఇక్కడే పెరిగా… MPగా కూడా పోటీ చేశా.
అయినా నా VOTE తొలగించారు!
— M9 NEWS (@M9News_) August 11, 2026




