చందు మొండేటి… ‘కార్తికేయ’ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఒక్కసారిగా వినిపించిన పేరు. దైవత్వంతో కూడిన సైన్సు ఫిక్షన్ కధను అద్భుతంగా తెరకెక్కించిన చందు, తన రెండవ సినిమాగా మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’ రీమేక్ ను ఎంచుకోవడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ రీమేక్ ను కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో… మరోసారి చందు పేరు టాలీవుడ్ లో ప్రముఖంగా వినపడుతోంది.
అలాంటి చందుతో తాజాగా ఓ వెబ్ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ జరిపారు. ఈ క్రమంలో తన భార్య గురించి చెప్పుకొచ్చిన చందు… బాగా ఏమోషనల్ అయ్యారు. తానూ దర్శకుడిని అవడానికి పడ్డ కష్టం కంటే, తనను దర్శకుడిగా చేయడానికి తన భార్య చాలా కష్టపడిందని, తన జీతం మీద ఆధారపడి బ్రతికేవాడినని చెప్పిన చందు… తను కడుపుతో ఉన్న సమయంలో 25 కిలోమీటర్లు ఆఫీస్ కు వెళ్లి వచ్చేదని చెప్పడంతో… సదరు మీడియా ప్రతినిధి కంట కన్నీరు ఆగలేదు.
ఈ సందర్భంగా ఏమోషనల్ అయిన చందు కళ్ళు కూడా చమర్చగా… తానూ ఏమోషనల్ పర్సన్ అని, తన భార్యకు ‘ఐ లవ్ యు’ అని చెప్పడం చాలా చిన్న పదంలా భావిస్తానని, ఒక్క మాటలో చెప్పాలంటే… తన తల్లితండ్రులకు ఎంతగా రుణపడి ఉంటానో, తన భార్యకు కూడా అంతే రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.



