జగన్ ను కలిసిన ప్రియాంక పేరెంట్స్….న్యాయం రూపం మారుతుందా.?

Jagan meets Priyanka's parents

ఆగస్టు 3 రాత్రి రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రియాంక ఆమె స్నేహితుడు సినిమా చూసి బయటకు వచ్చే క్రమంలో ప్రసాద్ ఆదిత్య మాల్ గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో పలుమార్లు ప్రియాంక ప్రయాణిస్తున్న బైకును గుద్దారు.

ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ కి తరలించారు. అయితే కిమ్స్ లో చికిత్స పొందుతూ చివరికి బ్రెయిన్ డెడ్ తో ప్రియాంక ప్రాణాలు విడిచింది. దీనితో ఇటు ఏపీ తక్షణమే స్పందించి కేసు విచారణకు ఆదేశించడం తో పాటుగా బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది.

ADVERTISEMENT

అలాగే ప్రియాంక చావుకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యూడిషయల్ కస్టడీ కి పంపారు. మొదట హిట్ అండ్ రన్ గా కేసు నమోదు చేసిన అధికారులు అటు పై కేసు విచారణ ను లోతుగా పరిశీలిస్తున్నారు. అసలు ఘటన జరగడానికి గల కారణాలేంటి.? తాగిన మత్తులో ఇలా ప్రవర్తించారా.? లేదా ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారా అనే దాని పై విచారణ జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో నేడు ప్రియాంక తల్లితండ్రులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. తమ కుమార్తె కు న్యాయం చెయ్యాలని జగన్ సాయం కోరారు ప్రియాంక పేరెంట్స్. అయితే ఇక్కడ జగన్ కూడా ప్రియాంక పేరెంట్స్ కి మద్దతుగా మాట్లాడారు. ప్రియాంక కేసు లో నాయ్యం జరిగేలా పార్టీ తరుపున న్యాయ పోరాటం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

అయితే ఇక్కడ జగన్ ప్రియాంక తల్లితండ్రులకు ఇచ్చిన భరోసాను ఎవ్వరు తప్పుపట్టడం లేదు. కానీ అదే సందర్భంలో సిదిరి అప్పలరాజు తనయుడు హిట్ అండ్ రన్ కేసులో జగన్ బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు. కనీసం సిదిరి తనయుడు హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించని జగన్ సిదిరి కుటుంబం కోసం ఓదార్పు యాత్రలు చేసారు.

మరి ఇక్కడ ప్రియాంక కు జరిగినది అన్యాయం అయితే అక్కడ గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి జరిగింది న్యాయమా.? సమయాన్ని, సందర్భాన్ని, మనిషి బట్టి జగన్ దృష్టిలో న్యాయం రూపం మార్చుకుంటుందా.? అక్కడ సిదిరి కుటుంబం కోసం నిలబడిన జగన్ ఇదే హిట్ అండ్ రన్ కేసును చిన్న పిల్లోడు తెలిసి తెలియ చేసాడు అంటూ సమర్ధించారు.

ఇప్పుడు ప్రియాంక విషయంలో ప్రియాంక కు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి అంటూ వాదిస్తున్న జగన్ దానయ్య కుటుంబం గురించి ఒక్క క్షణం అయినా ఆలోచించారా.? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎదురవుతున్నాయి.

ఏదిఏమైనా సిదిరి తనయుడైన, దుష్యంత్, ఆండ్ర విలియం అయినా కూడా నేరస్తులకు శిక్ష పడాలి, బాధితులకు న్యాయం జరగాలి.

ADVERTISEMENT
Latest Stories