ఇన్ క్రెడిబుల్ ఇండియా (అతుల్య భారత్)… అంతర్జాతీయ వేదికపై ఇండియాకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చి, మరింత మంది విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం. ఈ బాధ్యతలను భుజాన వేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను అర్ధాంతరంగా తొలగించడం, ఆపై బిగ్ బీ అమితాబ్ ను నియమించడం ఖాయమని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే అమితాబ్ పేరు ఖరారైందని వెలుగు చూసిన వేళ.., ఇండియాలో పన్ను చెల్లించకుండా, డబ్బును విదేశాలకు తరలించారని ‘పనామా పేపర్స్’లో ఆరోపణలు రావడంతో, అమితాబ్ ను ఎంపిక చేస్తే విమర్శలు ఎదురవుతాయని భావిస్తున్న టూరిజం శాఖ చూపులు ప్రియాంకా చోప్రా వైపుకు మళ్ళుతున్నట్లు తెలుస్తొంది. ఇటీవల పీపుల్స్ చాయిస్ అవార్డును ప్రియాంక దక్కించుకోవడం, ఆస్కార్ వేదికపై మెరవడం, దేశంలోని ప్రజలందరికీ తెలిసుండటం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రియాంకకు ప్లస్ పాయింట్లని భావిస్తున్న టూరిజం అధికారులు ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు ప్రచారకర్తగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం.



