జగన్ పాదయాత్ర కూటమి అంతిమ యాత్ర అంటా…

Gudivada Amarnath

గుడివాడ అమర్నాథ్ హోమ్ మంత్రి అనిత మీద చేసిన మేకప్ కామెంట్స్ కు గాను ఆయన నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ మాట్లాడుతూ అనిత మీద చేసిన కామెంట్స్ కి తానూ ఇప్పటికి కట్టుబడి ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.

తానూ కేవలం అనిత కు రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశానంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న గుడివాడ విచారణకు హాజరయ్యేందుకు గాను వందలాదిమంది ని వెంటేసుకుని బలప్రదర్శనకు దిగారు. ఇక విచారణ పూర్తి అయిన తరువాత కూడా గుడివాడ మీడియా ముందు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ అయ్యింది ఇక సెకండ్ ఆఫ్ లో జగన్ పాదయాత్ర మొదలవుతుందని ఇక అదే కూటమి అంతిమ యాత్ర అంటూ గుడివాడ అమరనాథ్ వైసీపీ క్యాడర్ కి మంచి జోష్ ఇచ్చే ప్రకటనలు చేసారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయి ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో వైసీపీ నేతల భాషలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.

మళ్ళీ అవే బూతు రాజకీయాలు చేస్తూ ప్రజల ముందు మరింత పలుచనవుతున్నారు. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఇప్పటికి అమరావతి కట్టుబడి లేదనే విషయం సుస్పటం. తాజగా రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటనలు గమనిస్తే స్థానిక ప్రజలు వైసీపీ నేతల మీద ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధమవుతుంది.

రప్ప రప్ప రాజకీయాలు చేస్తూ మేము అధికారంలోకి వస్తే అధికారులను వదిలిపెట్టం, ప్రత్యర్థి పార్టీల నేతలను వదిలిపెట్టాం అంటూ మొదలుపెట్టి చివరికి వారి బెదిరింపులు పారిశ్రామిక వేత్తల వరకు వెళ్తున్నాయి. ఇటువంటి బహిరంగ ప్రకటనలు ఇస్తూ రాష్ట్ర భవిష్యత్ ని ప్రశ్నార్ధకంలో పడేస్తున్న వైసీపీ జగన్ పాదయాత్రలతో పరిస్థితులను తమకు అనుకులంగా మార్చుకోగలదా.?

ఇక మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ అమరావతిని సమాధి చేసిన జగన్ ఇక ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. మరి ఇప్పుడు జగన్ పాదయాత్ర రాజధాని ప్రాంతంలో ఉంటుందా.? ఉంటే అక్కడి ప్రజలకు అమరావతి పట్ల జగన్ ఎటువంటి భరోసా ఇస్తారు.? తన పాదయాత్రతో తిరిగి వారి నమ్మకాన్ని పొందగలరా.? అది సాధ్యమా.?

అలాగే గత ఐదేళ్ళు రాజధాని విశాఖే అంటూ విశాఖ ప్రజలను నమ్మించిన జగన్ ఇప్పుడు విశాఖ ప్రజలకు మావిగన్ కే మా ఓటు అంటూ చెప్పగలరా.? 2024 ఎన్నికల ముందు కూడా వైసీపీ వై నాట్ 175 కి సిద్ధమా.? అంటూ మరో ఛాన్స్ పై ఇంతే నమ్మకంగా ఉంది. టీడీపీ, జనసేన పార్టీల పై ఇంతే దారుణంగా విరుచుకుపడింది.

కానీ కట్ చేస్తే 151 నుంచి 11 కి పడింది. ఇక ఇప్పుడు కూడా అదే మాదిరి మాదే అధికారం, జగన్ 2.0 కి సిద్ధమా.? రప్ప రప్ప రాజకీయాలే మా ప్రాధాన్యత అంటున్న వైసీపీ కి జగన్ పాదయాత్రతో మరో ఛాన్స్ వస్తుందా.? అలాగే గుడివాడ అమర్నాథ్ ఉహిస్తున్నట్టుగా అదే కూటమి అంతిమ యాత్ర అవుతుందా.?

ADVERTISEMENT
Latest Stories