టాప్ హీరోయిన్ బయటపెట్టిన లవ్ సీక్రెట్!

Priyanka Chopra Latest News - Hollywoodఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో సినీ నటులను మించిన వారు మరొకరుండరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్ కు తగిన విధంగా మాట్లాడుతోందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. క్వాంటికో సీరియల్ లో నటించి అమెరికన్లను ఆకట్టుకున్న ప్రియాంకా చోప్రా… ఇప్పుడు బేవాచ్ లో విక్టోరియా లీడ్స్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది.

ఈ నేపథ్యంలో జీవితంలో ఎప్పుడైనా చూడగానే తొలి ప్రేమ కలిగిన సెలబ్రిటీ ఉన్నారా? అని క్లైర్ మేగజీన్ రిపోర్టర్ అడగగా… ‘అమెరికా ర్యాపర్ టుపాక్ షకుర్ ను చూడగానే అలాంటి భావన కలిగిందని, అతనంటే ఇష్టమని’ చిలక పలుకులు పలికింది. తాను ప్రేమ కోసం ఎదురు చూసే రకాన్ని కాదని, అలా జరగాలని ఉన్నప్పుడు అలా జరిగిపోతుందని తెలిపింది. అలా జరిగిపోతున్నప్పుడు జరగాల్సిన మంచిని పాడు చేసుకోవడం ఎందుకు అనిపిస్తుందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories