ప్రతి సంవత్సరం దాదాపు అరడజను చిన్న మరియు పెద్ద సినిమాలను తీసే టాలీవుడ్‌లో దిల్ రాజు అత్యంత బిజీ నిర్మాత. ఆయన ఏటా డజనుకు పైగా చిత్రాలను పంపిణీ కూడా చేస్తారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ బిజీగా ఉంటారు అయితే, కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఆయన తీవ్రమైన నగదు సంక్షోభంలో ఉన్నట్లు చెబుతారు.
దిల్ రాజు సంబంధించిన రెండు పెద్ద సినిమాలు – నాని మరియు సుధీర్ బాబు యొక్క వి, పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ విడుదల ఇప్పుడు అనిశ్చితంగా మారింది. అలాగే కొన్ని చిన్న చిత్రాల నిర్మాణం కూడా ఆగిపోయింది. మరొక వైపు, మహేష్ బాబు మరియు వంశి పైడిపల్లి కాంబినేషన్ లో రావాల్సిన ప్రాజెక్ట్ కూడా నిలిపివేయబడింది.
కథ చర్చలకు మంచి మొత్తాన్ని ఖర్చు చేశారు దిల్ రాజు. అలాగే దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చాడు. దీనితో ఆయన అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఈ సమస్య గురించి పెద్ద చింతించాల్సిన విషయం ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడు సాధారణమవుతాయో ఎవరికీ తెలియదు. దిల్ రాజు వంటి బడా నిర్మాత పరిస్థితే ఇలా ఉంటె చిన్న నిర్మాతల సంగతేంటో?
చాలా మంది నిపుణులు కనీసం సంవత్సరానికి ఆర్థిక మందగమనాన్ని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 14 తరువాత లొక్డౌన్ ను అంచలంచలుగా రిలాక్స్ చేస్తారని అంటున్నారు. అయితే సినిమా హాళ్ళు మాత్రం చివరి దశలోనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓపెన్ అయ్యాకా కూడా కొంత కాలం జనం వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంది.





