గురువు గారేనా… నాకు లేదా టాలెంట్..?

Puri Jagannadh Connects Hug Filmడిసెంబర్ 31వ తేదీ… రాత్రి 10 గంటలకు… “హగ్” పేరుతో ఓ షార్ట్ ఫిలిం విడుదల చేయబోతున్నానని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది… క్షణాల్లో ఇది కాస్త వైరల్ అయ్యింది. “ఒక చెట్టును హగ్ చేసుకుని ఉన్న ఒక అమ్మాయి” ఫోటో ఇది.

ఇందులో వింతేముంది అనుకుంటున్నారా… ఆ మహిళ వివస్త్రగా ఉండడమే ఇక్కడ పూరీ మార్క్ ను ప్రతిబింబించేలా చేస్తోంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత తన గురువు గారు రాంగోపాల్ వర్మ రూటును పూరీ ఫాలో అవుతున్నారా? అన్న సందేహం కలగడం సహజమే.

ADVERTISEMENT

ఇప్పటికే హిందీ షార్ట్ ఫిలిం ట్రైలర్ లో ఓ మహిళను పూర్తి వివస్త్రగా చూపించి వర్మ సృష్టించిన సంచలనం తెలియనిది కాదు. దీంతో పూరీ “హగ్” ఫోటో కూడా హంగామా చేస్తోంది. బహుశా నూతన ఏడాది నాడు నెటిజన్లకు నిద్ర లేకుండా చేయడానికి పూరీ సిద్ధమవుతున్నారో ఏమో..?

ADVERTISEMENT
Latest Stories