ఈ చంద్రబాబు ఎప్పుడూ ఇంతే… ఎలా వేగేదబ్బా?

chandrababu-naidu-quantum-valley-tech-park-in-amaravati

చంద్రబాబు నాయుడు వయసు 74. ఆయన దృష్టిలో అదో నంబర్ మాత్రమే! దాంతో తనకు సంబంధమేమీ లేన్నట్లు దూసుకుపోతుంటారు. యువనాయకులని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ కూడా ఆయనతో పోటీ పడలేకపోతుంటారు.

సరే! ఆయన ఏదో జన్మలో అమృతం తాగి ఉంటారు కనుక అలా పరుగులు పెడుతున్నారని సరిపెట్టుకున్నా, ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఐటి కంపెనీలంటారు.. సాఫ్ట్ వేర్ అంటారు.. స్కిల్ డెవలప్‌మెంట్‌ అంటారు.. రాజకీయ ప్రత్యర్ధులకు ఆయన బుర్రలో ఏముందో ఓ పట్టాన్న అర్దం కాదు.

ADVERTISEMENT

సరే! ఆయనతో పోటీ పడి ఎలాగో కంప్యూటర్స్, సాఫ్ట్ వేర్, ఐటి కంపెనీల గురించి నాలుగు విషయాలు తెలుసుకున్నామని సంతోషపడేలోగా ఆయన మళ్ళీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అంటారు.. డ్రోన్ టెక్నాలజీ.. క్వాంటమ్ వ్యాలీ అంటూ కొత్త కొత్త విషయాలు అనర్గళంగా మాట్లాడే స్తుంటారు.

మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లలో సాఫ్ట్ వేర్ ఎప్పటికీ అప్పుడు ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతుంది. అలాగే మనం కూడా ఈయనతో పోటీ పడుతూ అప్‌డేట్‌ అవ్వాలా? ఇదెక్కడి ఖర్మరా బాబు?అని జగన్‌ తలపట్టుకునే ఉంటారు.

నా మానాన్న నేను బటన్ నొక్కుతూ సంక్షేమ పధకాలతో ప్రజలకు మేలు చేసుకుంటుంటే మద్యలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ గోల ఏమిటి?

వీటి గురించి ఈ వయసులో ఆయన గలగల మాట్లాడేస్తూ యువతని ఆకట్టుకుంటుంటే, వాటి గురించి ఓనమాలు కూడా తెలియని నేను, నా పార్టీ నేతలు అవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి?ఒకవేళ మేము ఇవన్నీ నేర్చుకునే వరకు ఆయన ఆగుతారా? అంటే అగరు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ గురించి నేర్చుకొని దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టేస్తారు! ఈయనతో ఎలా వేగాలి? ఈ టెక్నాలజీ మన తలకు మించిన విషయం.

అదే.. పరామర్శలు, శవ రాజకీయాలైతే మనకి కొట్టిన పిండి కనుక చంద్రబాబు నాయుడు కూడా మనతో పోటీ పడలేరు. కనుక పరుగులు తీస్తున్న ఈ 74 ఏళ్ళ కుర్రాడికి బ్రేకులు వేసి శవరాజకీయాల వైపు మళ్ళిస్తే తప్ప మనం పైచేయి సాధించలేము.. అని జగన్‌ అనుకుంటున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories