ఆంధ్రప్రదేశ్ లో ఇంటి వద్దకే రేషన్ అని… సరైన టైం లో లేకుండా పోయింది

Ques at ration Shop in andhra Pradeshకరోనా వైరస్ రక్కసి ప్రపంచమంతటినీ వణికిస్తోంది. దేశంలో ఇప్పటికే 1000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. 21 రోజుల లాక్ డౌన్ లో ఈరోజు నాలుగో రోజు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 19 కేసులు నమోదు అయ్యాయి. శనివారం ఒక్క రోజే ఆరు కేసులు నమోదు అయ్యాయి.

ADVERTISEMENT

ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటి సారి. దీనితో ప్రజలంతా భయకంపితులు అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెద్ద తప్పే చేసింది. ఈరోజు నుండి రాష్ట్రంలో పేదలకు ఉచిత రేషన్ పంపిణీ మొదలు పెట్టింది. ఇప్పటివరకూ వాలంటీర్లతో రేషన్ పంపిణీ అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇంతటి కీలక సమయంలో చేతులు ఎత్తేసింది.

లబ్దిదారులనే రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి తెచ్చుకోమంది. దీనితో ఈరోజు ఉదయం ఐదు గంటల నుండే రేషన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. దీనితో కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామ వాలంటీర్ లను నియమించి సరుకులు అన్నిటినీ ఇంటి వద్ద ఇచ్చేటట్టు గా ఏర్పాటు అని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సామాజిక దూరం పాటించే రేషన్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ వాలంటీర్ల వ్యవస్థ ఉండగా అసలు ప్రజలను బయటకు రప్పించడం అనవసరమైన రిస్క్ అని పలువురు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories