యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని ఇప్పటివరకు లవ్ స్టోరీగా ప్రమోట్ చేశారు. అయితే అభిమానుల కోసం సినిమాలో తగినంత యాక్షన్ స్టఫ్ ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ బృందం ఒక నెల రోజుల యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ యాక్షన్-స్టంట్స్ డైరెక్టర్ నిక్ పావెల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కల నెరవేరడానికి దాదాపు 1000 మంది 100 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేశారని ఆయన అన్నారు. రాధా కృష్ణ కుమార్ … మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ సీన్లు చిత్రీకరించారని చెప్పుకొచ్చాడు. ఈ వార్త ప్రభాస్ అభిమానులకు ఎంతో ఉపశమనం కలిగించింది. సినిమా యొక్క యాక్షన్ పార్ట్ గురించి దర్శకుడు వారి సందేహాన్ని తొలగించారు.
ప్రభాస్ దేశవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు యాక్షన్ హీరోగానే చూస్తారు. అందుకే సాహో తెలుగులో ప్లాపయినా హిందీలో హిట్ గా నిలిచింది. మరోవైపు… రాధే శ్యామ్ 2021 ఏప్రిల్ సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకర్ ఖరారయ్యారు.
ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు సంగీతం అందించనున్నారు. ఇకపోతే హిందీ వెర్షన్ కి ఇప్పటిదాకా ఎవరు మ్యూజిక్ చేస్తారు అనేదాని మీద క్లారిటీ లేదు. ప్రభాస్ సరనస ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెలలోనే షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.





