రఘురామను పక్కన పెట్టడం, వివేకా ప్రస్తావన చేయడం రెండూ చిత్రమే!

Raghu-Rama-Krishna-Raju-MP

టిడిపి, జనసేన, బీజేపీల తరపున గట్టిగా వాదనలు వినిపిస్తున్నవారు, జగన్‌ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నవారు ఎవరంటే అందరికీ రఘురామకృష్ణ రాజు గుర్తొస్తారు. కానీ ఆయనకు మూడు పార్టీలలో ఏదీ టికెట్‌ ఇవ్వకపోవడం విచిత్రమనిపిస్తుంది.

ఆయనకు అవి ఎందుకు నర్సాపురం టికెట్‌ ఇవ్వలేదనే చర్చ అప్రస్తుతం. కానీ ‘జగన్‌ చక్రం తిప్పి ఆయనకు టికెట్‌ దక్కకుండా చేశారనే’ సోషల్ మీడియాలో ప్రచారంతో కూటమి డొల్లతనాన్ని వైసీపి తెలివిగా చాటింపు వేసుకోగలుగుతోంది. కానీ ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఆయనకు టికెట్‌ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున, ఆయనకు ఏదోవిదంగా ఉపశమనం కలిగించగలిగితేనే వైసీపి మొసలి కన్నీళ్ళు ఆగుతాయి.

ADVERTISEMENT

ఇక వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి, మరో పక్క టిడిపి, జనసేనలు చేస్తున్న ఆరోపణలకు సూటిగా జవాబు చెప్పుకోలేక వైసీపి ఇబ్బంది పడుతున్నప్పుడు, దాని అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, వివేకా హత్య ప్రస్తావన చేయడం వైసీపి శ్రేణులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఈ కేసు విషయంలో తాము ప్రజల ముందు తలదించుకోవలసిన అవసరం లేదని చెప్పేందుకే బహుశః జగన్‌ వివేకా హత్య ప్రస్తావన చేసి ఉండవచ్చు. కానీ ఆ విదంగా మాట్లాడి వివేకా హత్య కేసుని మళ్ళీ ప్రజల మనసుల్లో ‘రిఫ్రెష్’ చేసి మళ్ళీ కొత్త చర్చ మొదలుపెట్టించిన్నట్లయింది. అలాగే ఇప్పటికే ఈ కేసుతో జగన్, అవినాష్ రెడ్డిలను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్న టిడిపి, జనసేనలకు జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా మరో అస్త్రం అందించిన్నట్లయింది.

అంటే రఘురామ విషయంలో టిడిపి, జనసేన, బీజేపీలు జగన్‌కు దొరికిపోతే, వివేకా హత్య కేసు విషయంలో జగన్‌ ఆ మూడు పార్టీలకు దొరికిపోయారని అర్దమవుతూనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories