కథ అడ్డం తిరిగిందా….తిప్పారా..?

Raghu-Rama-Krishna-Raju-MP

2019 ఎన్నికలలో వైసీపీ నుండి నర్సాపురం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన రఘు రామరాజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే అధికార పార్టీ పై, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ కి రెబల్ అభ్యర్థిగా మారిపోయారు.

దానికి ఫలితంగా వైసీపీ కూడా RRR మీద అనేక ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి అరెస్టులు చేసి అటు మానసికంగా ఇటు శారీరకంగా హింసించి, రఘురామా ను తన సొంత నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా ఇబ్బందులు పెడుతూనే వచ్చింది.

ADVERTISEMENT

అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు అధికార పార్టీలో ఉంటూనే ఆ పార్టీ కి వ్యతిరేకంగా రోజుకో రచ్చబండ నిర్వహిస్తూ జగన్ పై నిప్పులు చెరుగుతూనే వచ్చారు. ఇలా జరుగుతున్న రఘురామా రాజకీయ జర్నీ కి ఎన్నికల రూపంలో మరో అవకాశం వచ్చింది అని భావించారు.

అయితే 2024 ఎన్నికల నాటికీ టీడీపీ – జనసేన – బీజేపీ ల పొత్తు ఖాయమని ఆ కూటమి అభ్యర్థిగా 2024 ఇదే నియోజకవర్గం నుండి ఎంపీ గా పోటీ చేసి బంపర్ మెజారిటీతో వైసీపీ ని చిత్తుగా ఓడించి తీరుతాను అంటూ శపధాలు కూడా చేసారు RRR .

అనుకున్నట్టే మూడు పార్టీల పొత్తు పొడిచినప్పటికీ రఘురామా రాజు ఆశలు ఆవిరైపోయాయి. పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన బీజేపీ అక్కడ నుంచి RRR కి కాకుండా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు అవకాశం కల్పించారు. దీనితో ఇన్నాళ్ల నుంచి కూటమి అభ్యర్థిగా వైసీపీ పై విజయం సాధించాలి అంటూ RRR చేసిన పోరాటం నీరుకారిపోయినట్లయ్యింది.

అయితే కూటమి తరుపున తనకు బీజేపీ నుండి సీటు రాకుండా అడ్డుపడ్డ ఆ శికండి వైసీపీనే అంటూ రాజు గారు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఐదేళ్లు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఢిల్లీలో కూర్చున్నప్పటికీ RRR పై జగన్ అనుసరించిన విధానాలకు అక్కడి ప్రజలలో రాజు గారి పట్ల సానుభూతి పెరిగింది.

కచ్చితంగా విజయం సాధించే సీటుని బీజేపీ అభ్యర్థిని మార్చి ఎందుకు రిస్క్ లోకి తీసుకువెళుతుంది అనేది ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీ నేతలకు అర్ధం కానీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. RRR విషయంలో ఈ రెండు పార్టీల అంచనాలను, రఘురామా ఆశలను బీజేపీ అడ్డం తిప్పిందా…? లేక ఎవరైనా తిప్పారా..? అనేది తేలాల్సి ఉంది.

వైసీపీ ఒత్తిడ్లకు బీజేపీ పెద్దలు తలొచడం వల్లనే నాకు అక్కడ సీటు దక్కలేదు..అంటూ రాజు చేస్తున్న ఆరోపణలు నిజమైతే పొత్తు పెట్టుకున్న పార్టీలను కాదని ప్రత్యర్థి పార్టీ ఒత్తిడికి లొంగిపోయిన బీజేపీ ఎవరి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు..? దీని వలన లాభం పొందేదెవరు..? నష్టపోయేదెవరు..?

అసలు ఏపీలో బలమే లేని బీజేపీ పట్టువిడుపులు పాటించాల్సిన మిత్ర పక్షాల దగ్గర పట్టు పట్టి సీట్లు దక్కించుకుని ప్రత్యర్థి వర్గం ఒత్తిడ్లకు లొంగిపోతే అసలు ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటి అనే దాని మీద సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories