ఆర్ఆర్ఆర్ అసలు ఖాళీగా ఉండడం లేదుగా

Raghuram Krishna Raju seems to be fully focused for his revenge.పుట్టిన రోజు నాడు తనను అరెస్టు చేసి ఆ తరువాత సీఐడీ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతీకారంగా ఊగిపోతున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఇప్పటికే ప్రభుత్వం మీద యుద్దానికి సిద్ధం అయ్యారు. సీఐడీ కస్టడీలో తనను కొట్టిన ఉదంతంపై సిబిఐ ఇచ్చారని చేయించాలని ఇప్పటికే సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

తన అరెస్ట్ సమయంలో ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్రం పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను, మార్గదర్శకాలను హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఆర్ఆర్ఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంప్లయింట్ చేస్తూ ఒక లేఖ రాశారు.

ADVERTISEMENT

అదే విధంగా నిన్న కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ ని కలిసి ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ అలాగే గుంటూరు ఎస్పీతో కలిసి కుట్రపూరితంగా తనను తొందరగా డిశ్చార్జ్ చేయించి మళ్ళీ అరెస్టు చేయించాలని ప్రయత్నించారని కంప్లయింట్ ఇచ్చారు. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌ పి.సి.పంత్‌ను కలిసి సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు.

బెయిల్ పై విడుదలైన మరుక్షణం నుండి రఘురామ కృష్ణం రాజు తన ప్రతీకారం తీర్చుకోవడం మీదే పూర్తిగా దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం మాట ఎలా ఉన్నా ఆర్ఆర్ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు, ఆయనకు ఎటువంటి దెబ్బలు తగల్లేదని రిపోర్టు ఇచ్చిన గుంటూరు డాక్టర్లకు ఆర్ఆర్ఆర్ దూకుడికి కంటిమీద కునుకులేకుండా పోయిందట.

ADVERTISEMENT
Latest Stories