క్రికెట్ – రిటైర్డ్ హర్ట్… ఇలాక్కూడా అవుతారా..!

Rahkeem Cornwall Hit 6 Sixes, Then Retired Himself క్రికెట్ విజ్ఞులకు ‘రిటైర్డ్ హర్ట్’ అన్న పదం పరిచయం చేయాల్సిన పని లేదు. మైదానంలో ఆడుతున్న సమయంలో ఏదైనా అనుకోని గాయాల పాలైనపుడు, ఆటగాడి ఆరోగ్య భద్రత రీత్యా… ‘రిటైర్డ్ హర్ట్’ పేరుతో మైదానం విడిచి పెవిలియన్ కు చేరుతారు. కొన్ని కొన్ని ప్రాక్టీసు మ్యాచ్ లలో అయితే ఆటగాడు ఓ మైలురాయికి చేరుకోగానే వాలెంటరీగా రిటైర్డ్ హర్ట్ కింద వెనుతిరుగుతాడు. అయితే ఇవి అంతర్జాతీయ మ్యాచ్ లకు ఈ నిబంధన వర్తించదు. ఇప్పటివరకు క్రికెట్ లో ఇలాగే ‘రిటైర్డ్ హర్ట్’ పేరుతో వెనుదిరగగా, తాజాగా ఓ విండీస్ బ్యాట్స్ మెన్ తన భారీ కాయాన్ని మోయలేక రిటైర్డ్ హర్ట్ కింద పెవిలియన్ కు వెళ్ళాడు.

వెస్టిండీస్ లో కరీబియన్ లీగ్‌ లో భాగంగా బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూయిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో… తొలుత బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ జట్టు 195 పరుగులను నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూయీస్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టులో భారీకాయుడిగా పేరొందిన రకీమ్ కార్నివాల్ (153 కేజీలు) బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, బౌండరీలతో బార్బడోస్ బౌలర్లను ఓ ఆట ఆదుకున్నాడు. కేవలం 43 బంతుల్లోనే 80 పరుగులు చేసిన రకీం, తన భారీకాయంతో మైదానంలో సింగిల్స్ కోసం పరుగులు తీయడం చాలా భారంగా మారింది.

ADVERTISEMENT

దీంతో 18వ ఓవర్ రెండో బంతి సమయంలో కడుపునొప్పి బాధించడంతో రిటైర్డ్‌ హర్ట్‌ గా వెనుదిరిగాడు. రకీం పెవిలియన్ చేరుకోవడంతో ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇలా శరీర బరువు మోయలేక ఇబ్బందికి గురై, ఓ బ్యాట్స్ మేన్ రిటైర్డ్ హర్ట్ అయిన తొలి సంఘటన ఇదే కావడం విశేషం. గతంలో ఎవరైనా గాయాల పాలైతే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా రిటైర్డ్ హర్ట్ అయిన సంఘటనలు లేకపోవడం విశేషం. బ్యాటింగ్ లో సిక్స్‌ లు, ఫోర్లతో స్టేడియంలోని ప్రేక్షకులను కేరింతలు కొట్టేలా చేసిన రకీం, ఈ మ్యాచ్ తర్వాత తన పేరును ఈ విధంగా కూడా పాపులర్ చేసుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories