రాహుల్ గాంధీ పెళ్లి అయిపోయిందంట

Rahul Gandhi Response on his marriageకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ ని మీడియా ప్రతినిధులు పెళ్లి ఎప్పుడు అని అడగగా.. తన పెళ్లి కాంగ్రెస్ తో అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే దాని అర్దం తాను కాంగ్రెస్ కే అంకితం అయిపోయాయని, అందుకే కాంగ్రెస్ తో వివాహం అయిపోయిందని చెప్పారా అని అనుకోవాలి.

[m9ad]

ADVERTISEMENT

48 ఏళ్ళ రాహుల్ గాంధీ ఇటీవలే కాంగ్రెస్ పగ్గాలు పూర్తి స్థాయిలో చేపట్టారు. ఒక విధంగా కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారిన 2019 ఎన్నికల కోసం ఆయన నానా తంటాలు పడుతున్నారు. బిజెపికి 230 లోక్ సభ స్థానాలు వస్తే కాని ప్రధాని గా మళ్లీ మోడీ కాలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

బిజెపి కి అన్ని సీట్లు రావని, వచ్చే ఎన్నికల తర్వాత మోడీ ప్రధాని అవడం కలేనని ఆయన అన్నారు.మోడీ ఊహలలో బతుకుతున్నారని, ఆయన ప్రధాని కాలేరని అన్నారు. యుపి, బీహారు లలో పొత్తుల వల్ల బిజెపికి వచ్చే సీట్లు బగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేశారు. మోడీ అయితే వాస్తవానికి మోడీ కంటే రాహులే కలల్లో విహరిస్తున్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

ADVERTISEMENT
Latest Stories