బుల్లితెర బ్యూటీ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతానికి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ప్రత్యూష, ఆత్మహత్యకు ముందు అబార్షన్ చేయించుకుందని ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా అదే పత్రిక మరో సంచలన విషయాన్ని వెల్లడించింది.
ప్రత్యూష బెనర్జీ గర్భవతి అన్న విషయం తనకు ముందే తెలుసని ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పోలీసులకు చెప్పాడట. తొలుత ఈ విషయం తనకు తెలియదని చెప్పిన రాహుల్… పోలీసులు కాస్తంత గట్టిగా అడిగేసరికి నిజం ఒప్పుకున్నట్లు తాజా సంచికలో ఓ కథనాన్ని ప్రచురించింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన ప్రత్యూష, అబార్షన్ చేయించుకున్న వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనతో రాహుల్ సంబంధం తెంచుకునేందుకు యత్నించే క్రమంలోనే ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా? లేక తనకు ఇష్టం లేకుండానే అబార్షన్ చేయించుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని, రాహుల్ రాజ్ సింగ్ తరఫున వకాల్తా పుచ్చుకుని, తర్వాత విరమించుకున్న న్యాయవాది నీరజ్ గుప్తా చెప్పినట్లు సదరు పత్రిక పేర్కొంది.



