రాజగోపాల్ రెడ్డి రాజకీయం…

Rajagopal Reddy speaks on Telangana Congress leadership rift

కాంగ్రెస్ పార్టీలో పార్టీ నిర్ణయాల పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల అంతర్గత స్వేచ్ఛ ఉండదు కానీ పార్టీ పై పార్టీ నాయకుల పై బహిర్గత విమర్శలకు మాత్రం ఆస్కారం ఉంటుంది. నాటి సోనియా గాంధీ నాయకత్వం నుంచి నేటి రాహుల్ గాంధీ నేతృత్వం వరకు పార్టీలో ఇదే సంస్కృతీ నడుస్తుంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పై అసంతృత్తి మరోమారు బయటకు వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్లు మాదిరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్నాయి.

ADVERTISEMENT

అయితే మొదటి నుంచి రేవంత్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఆయనకు అధిష్టానం నుంచి ముఖ్యమంత్రిగా ఆశీస్సులు దక్కడం పై అక్కసు కావచ్చు రాజగోపాల్ రేవంత్ నాయకత్వం పై వ్యతిరేఖ స్వరం వినిపించడానికి సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నారు.

తెలంగాణలో వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల పై మొదటి సారిగా వ్యతిరేక స్వరం వినిపించిన రాజగోపాల్, తనకు మంత్రి పదవి రాకపోవడం పై కూడా తోచినప్పుడల్లా రేవంత్ పై పరోక్షంగా విమర్శనా బాణాలు ఎక్కుపెడుతూనే వస్తున్నారు. ఈయన చర్యల పై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సీరియస్ అయినట్టు సమాచారం.

ఇక నేడు మీడియా ముందుకొచ్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజగోపాల్ మంత్రి పదవి కామెంట్స్ పై స్పందించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని, ఆ సమయంలో తానూ కూడా అక్కడ ఉన్నానని, కానీ మంత్రి వర్గ కూర్పులో భాగంగా రాజగోపాల్ కు మంత్రి పదవి దక్కలేదంటూ వాపోయారు.

అయితే భట్టి వ్యాఖ్యల పై స్పందించిన రాజగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తామంటూ మాట ఇవ్వడం వాస్తవమే అంటూ ప్రజలకు తెలియచేయడం ఆనందదాయకమని, అందుకు ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలోని , ప్రభుత్వంలోని ముఖ్య నాయకులే అడ్డుపడుతున్నారంటూ తన ఆవేదన చెప్పుకున్నారు.

ఇక తనకి మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజలకు పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి, అవినీతి రహిత పాలన సాగించే దిశగా కాంగ్రెస్ ముందుకెళ్లాలని ఆశించారు. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రభుత్వంలో భాగం అయ్యారు.

ఇక ఇప్పుడు అదే కుటుంబానికి, అదే సామజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడం అంటే మంత్రి వర్గంలో సామజిక నాయ్యం జరగినట్టవుతుందా.? గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కీలక పదవులలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న సామాజికవర్గం ఇప్పటికి తృప్తి చెందక పదవుల కోసం కొట్లాడడం హాస్యాస్పదం.

ADVERTISEMENT
Latest Stories