తారక్ రాజకీయాలపై రాజమౌళి మాట!

Rajamouli on Jr NTR politicsప్రస్తుతం సినిమాలలో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చి తీరుతారన్న టాక్ మరియు ఆ విశ్వాసం ప్రజల్లో కూడా ఉంది. బహుశా కాలం కలిసి వస్తే ఇప్పటికే ఓ చక్రం తిప్పే వ్యక్తిగా మారేవారేమో… చెప్పలేం గానీ, ప్రస్తుతానికి అయితే సినిమాలు తప్ప తనకు మరో ఉద్దేశం లేదని వివిధ సందర్భాలలో స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ‘హీరో’ కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యేవారు? ఖచ్చితంగా పొలిటిషియన్ అంటున్నారు ‘దర్శక ధీరుడు’ రాజమౌళి.

ADVERTISEMENT

అవును… జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులలో జక్కన్న ఒకరు. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో… ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్న వారంతా వేరే రంగాలలో ఉండాల్సి వస్తే… వాళ్ళేం చేస్తారని అడిగిన ప్రశ్నకు… తారక్ గురించి రాజకీయాలలో ఉంటారని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఇక ‘బాహుబలి’ ప్రభాస్ అయితే చెఫ్ గా సెటిల్ అయ్యుండే వాడని, రామ్ చరణ్ అయితే బిజినెస్ మెన్ గా ఉండేవాడని… అదిరిపోయే సమాధానాలు ఇచ్చారు. నిజంగా ఆ ముగ్గురికి కూడా అవే సూట్ అవుతాయని చెప్పవచ్చు.

అయితే ప్రభాస్, చెర్రీల సెగ్మెంట్ సాధారణం కాగా, జూనియర్ ఎన్టీఆర్ ది రాజకీయం కావడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికైనా ఖచ్చితంగా పొలిటిక్స్ లోకి వస్తాడని ‘యంగ్ టైగర్’ అభిమానులు విశ్వసిస్తున్న దానికి రాజమౌళి మాట మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది. ఈ మాట ఒక్క ఫ్యాన్స్ కే కాదు, తారక్ కు కూడా మాంచి బూస్ట్ ఇచ్చుంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే దేనికైనా సమయం… సందర్భం… రావాలి కదా..! ఇంకా చాలా వయసు, సమయం ఉందిలేండి..!

ADVERTISEMENT
Latest Stories