ప్రమోషన్స్ అందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా..!

Rajamouli Sets New Trend in Tollywood Promotions

ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ కి ముందు జరిగే మూవీ ప్రమోషన్సే సరిగా ఉండడం లేదని, చిత్ర యూనిట్ టికెట్ రేట్లు పెంచుకునే దాని మీద పెట్టె శ్రద్ద మూవీ ప్రమోషన్స్ మీద పెట్టడం లేదని, తమ అభిమాన హీరోలు కూడా మూవీ ప్రమోషన్స్ లో మునుపటి స్థాయిలో పాల్గొనడం లేదనే అభిప్రాయం సాధరణ టాలీవుడ్ అభిమాని నుండి వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు తాజాగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ OG చిత్రం పై ఈ ప్రమోషన్స్ లోపం అభిమానుల నుండి గట్టిగా వినిపించింది. మూవీ రిలీజ్ కి ముందు వరకు కూడా చిత్ర బృందం నుంచి ఎటువంటి ప్రమోషన్ కంటెంట్ బయటకు రాలేదు. మీడియాతో ఇంటర్ వ్యూ లు లేవు, చేసిన ఒక్క మ్యూజికల్ కాన్సెప్ట్ కూడా వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంది.

ADVERTISEMENT

అయితే గతంలో ప్రభాస్ సలార్ మూవీ కూడా ప్రమోషన్స్ పై అంతగా శ్రద్ద పెట్టలేదనే వాదన డార్లింగ్ అభిమానులు నుండి పెద్ద ఎత్తున వ్యక్తమయింది. ఇక దేవర సినిమాకి తారక్ సైతం ఈ విషయంలో తన అభిమానులను నిరాశ పరిచారనే చెప్పాలి.

మరి ఇంత స్టార్ డం ఉన్న హీరోలు, వందల కోట్ల బడ్జెట్ పెట్టె నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాల వెనుకబడ్డారనే చెప్పాలి. మూవీ ప్రమోషన్ సినిమా ఫలితాన్ని నిర్దారిస్తుంది అని చెప్పలేం కానీ ఆ మూవీ పై ఒక బజ్ ని అయితే క్రియేట్ చేయగలుగుతుంది అని చెప్పొచ్చు.

అయితే టాలీవుడ్ ని రెండు తెలుగు రాష్ట్రాలను నుండి పాన్ ఇండియా స్థాయికి పట్టికెళ్ళిన దర్శక ధీరుడు రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి బడా దర్శకుల నుంచి సుజిత్, ప్రశాంత్ వర్మ వంటి అప్ కమింగ్ డైరెక్టర్ల వరకు అందరు పాన్ ఇండియా చిత్రాలను రూపొందిస్తున్నారు.

పుష్ప తో సుకుమార్, యానిమల్ తో వంగా, సాహో తో సుజిత్, హనుమాన్ తో ప్రశాంత్ ఇలా ఎవరికీ నచ్చిన జోనర్ తో వారు పాన్ ఇండియా ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే ఈ విషయంలో రాజమౌళిని ఆదర్శంగా తీసుకున్న దర్శకులు మూవీని ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లే సినిమా ప్రమోషన్స్ లో కూడా జక్కన్నను ఆదర్శంగా తీసుకుని తీరాలి.

భారీ బడ్జెట్ తో నిర్మించిన బాహుబలి మూవీ ప్రమోషన్స్ కూడా జక్కన్న అంతే భారీగా నిర్వహించారు. ఏదోక వినూత్న పద్దతిలో ప్రేక్షకుడి అటెన్షన్ ను మూవీ వైపు తీసుకొచ్చే సత్తా జక్కన్న సొంత. RRR మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, తారక్ తో కలిసి రాజమౌళి ఇచ్చిన ఇంటర్ వ్యూ లు ఇప్పటికి టాలీవుడ్ అభిమానిని ఆకట్టుకుంటూనే ఉంటాయి.

RRR రిలీజ్ అయ్యి ఏడాది గడిచిన తరువాత కూడా రాజమౌళి ఎదో ఒక సందర్భంలో RRR ని ప్రమోట్ చేస్తూనే వచ్చాడు. అయితే మూవీ తెరకెక్కించడానికి ఏళ్లకు తరబడి టైం తీసుకునే జక్కన్న మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా రిలీజ్ కి ముందు తగిన సమయం కేటాయిస్తారు.

అయితే ప్రస్తుత కాలంలో ట్రెండ్ అవుతున్న రీ రిలీజ్ ల పర్వంలో బాహుబలి మరోసారి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో వెండితెర మీద ప్రేక్షకులను పలకరించనుంది. అందుకు తగ్గట్టే ఈ రిలీజ్ ను క్కూడా జక్కన్న తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా బాహుబలి ప్రభాస్ ని భల్లాలదేవుడు రానా ను పట్టుకొచ్చారు జక్కన్న.

రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి చేసిన ఒక ఇంటర్ వ్యూ ప్రోమోను మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రోమో కట్ కూడా జక్కన్న స్టైల్ లోనే ఉంది. దీనితో రీ రిలీజ్ కూడా ఇంత డెడికేషన్ ఏంటి సామి అంటూ రాజమౌళి నిబద్ధతకు దండాలు పెడుతున్నారు సినీ లవర్స్.

అలాగే మీడియాకు చాల దూరంగా ఉండే ప్రభాస్ ను ఈ రకంగా దగ్గర చేసినందుకు రాజమౌళికి రుణపడి ఉన్నాం అంటున్నారు డార్లింగ్ ఫాన్స్. ఏది ఏమైనా రాజమౌళి టాలీవుడ్ టార్చ్ బేరర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండకపోవచ్చు.

అయితే మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా జక్కన్న ఇతర దర్శకులకు ఒక మార్గదర్శకుడే అవుతాడు. ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు అనే డైలాగ్ రాజమౌళికి చక్కగా యాప్ట్ అవుతుందేమో.! ‘వైటింగ్ ఫర్ ది ఎపిక్ ఇంటర్ వ్యూ’ అంటూ సోషల్ మీడియా లవర్స్ ఈ ప్రోమోను వైరల్ చేసే పనిలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories