అమరావతి భవనాలకు రాజమౌళి ఇచ్చిన సలహాలు ఇవే!

Rajamouli Suggestions to Amaravati Designs!అమరావతి పాలన నగర ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆ పని మీద లండన్ వెళ్ళి వచ్చారు ఆయన. పాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ వర్క్ షాప్ను ఆయన ఆసక్తికారంగా తిలకించారు.

ADVERTISEMENT

దూరం నుండి కూడా కనిపించాలంటే భవనాల ఎత్తు ఎంత ఉండాలి. ఎలేవెషన్లు ఎలా ఉండాలి అని ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్టు సమాచారం. వజ్రం ఆకారంలో శాసనసభను నిర్మించాలని ముందు అనుకున్న రాజమౌళి సూచనతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

వీటి ఆధారంగా తొందర్లోనే వాళ్ళు ఫైనల్ ఆకృతులు తయారుచేస్తారు. ఈ .నెల చివరన ముఖ్యమంత్రి లండన్ వెళ్ళి నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన ఫైనల్ ఆకృతులు చూసి, ఆయన సంతృప్తి చెందితే అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.

ADVERTISEMENT
Latest Stories