ఇప్పుడు ఎక్కడ చూసినా రోబో 2.0 గురించే మాట్లాడుకుంటున్నారు. మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా తొలిరోజే ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఇక మరో పక్క రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండడం, ఇంకో పక్క అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించడం చూస్తూ ఉంటే, ఇటు దక్షిణ భారత దేశం మొదలుకొని, అటు ఉత్తర భారత దేశం వరకూ వచ్చే వారం నుంచి దేశం మొత్తం రజనీ మ్యానియాతో ఊగిపోతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
[m9ad]
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా కొన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అవి ఏంటి అంటే ఈ సినిమా టాప్ దర్శకుడు అయిన శంకర్ కరియర్ లో అతి చిన్న సినిమా అని, కేవలం 2 గంటల 28 నిమిషాలు అంటే మొత్తంగా 148 నిమిషాలు మాత్రమే సినిమా నిడివి ఉంటుంది అని. అయితే శంకర్ గత చిత్రం అయిన ‘ఐ’ అనుభవంతో ఈ సినిమాని ఎలా అయినా అతి తక్కువ నిడివితోనే రిలీజ్ చెయ్యాలి అన్నది శంకర్ ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అక్కర్లేని సినిమా సీన్స్ ను కత్తిరించేస్తున్నాడట శంకర్. అలా చేసి చివరకు తన కరియర్ లోనే అతి చిన్న సినిమాగా దీన్ని ప్రేక్షకులకు అందించనున్నాడని సమాచారం. ఇక రోబో ఫర్స్ట్ పార్ట్ అయితే 167 నిమిషాల వరకూ ఉంది అని, అంతకన్నా తక్కువ నిడివితోనే వెళ్ళాలి అన్న ఆలోచనతో శంకర్ ఈ ఆలోచన చేస్తున్నాడట. అయితే ఇదిలా ఉంటే మరో పక్క ఇంత చిన్న సినిమా కోసం శంకర్ ఏకంగా మూడేళ్లు టైమ్ తీసుకున్నాడా? అన్న విమర్శలకు సైతం అవకాశం లేకపోలేదు. పైగా ఒక టాప్ హీరోని, ఒక టాప్ బాలీవుడ్ నటుణ్ణి మోడేళ్ల పాటు ఈ సినిమాకి పనిచేసేలా చేసుకున్న శంకర్. చివరకు కనీసం సినిమాల్లో సహజమైన నిడివి అయిన రెండున్నర గంటలు కూడా ఈ సినిమా లేకుండా చేశాడు. అదంతా పాకక్‌నా పెడితే కత్తిరకు పదును పెడుతున్న శంకర్ కధ అయిన పూర్తిగా ఉంచుతాడో లేదో అన్న కామెంట్స్ సైతం బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయంట్ ఏంటి అంటే, ఈ సినిమా అతి తక్కువ నిడివి అయినా, చివరి అరగంట మాత్రం విషువల్ ఎఫ్ఫెట్స్ తో ప్రేక్షకులు పండగ చేసుకోవడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. చూద్దాం మరి శంకర్ కత్తి పదును ఎలా ఉండబోతుందో, ఎలాంటి ఫలితాన్ని రుచి చూడనుందో.



