మురుగదాస్ ‘స్కెచ్’ అదిరిందిగా!

rajinikanth-chief-guest-for-spyder-tamil-audio-launchటాలీవుడ్ ప్రిన్స్ నటిస్తున్న సినిమా మొదటిసారిగా తమిళంలో విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. అయితే తమిళంలోకి ప్రిన్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే విధంగా స్కెచ్ లు సిద్ధమైనట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే… పక్కా పకడ్బందీగా ఈ వ్యవహారం సాగుతోందని సమాచారం. ‘స్పైడర్’ తమిళ వర్షన్ ఆడియోను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిధిగా ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ను ఆహ్వానించే ఆలోచనలో ‘స్పైడర్’ చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో మహేష్ కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, అన్ని వర్గాల వారికి చేరువ కావాలంటే ఒక స్టార్ హీరో గుర్తింపు ఉండాలన్న భావనతో రజనీకాంత్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కలిసొచ్చే మరొక విషయం ఏమిటంటే… తమిళ రైట్స్ తీసుకున్న నిర్మాణ సంస్థ.

ప్రస్తుతం రజనీకాంత్ తో “రోబో 2.0” సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఈ ‘స్పైడర్’ తమిళ హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో రజనీ ఎంట్రీ మరి ఈజీగా మారిందనేది కోలీవుడ్ టాక్. రజనీతో పాటు దర్శకుడు శంకర్ కూడా ఈ వేడుకలో భాగస్వామి కావచ్చని టాక్. ఒకవేళ ‘రోబో 2.0’ యూనిట్ మిస్సయితే, తమిళ స్టార్ హీరో విజయ్ బరిలోకి వచ్చే విధంగా మురుగదాస్ స్కెచ్ సిద్ధం చేసినట్లు కోలీవుడ్ సమాచారం.

తమిళనాట మాంచి మాస్ బలం ఉన్న హీరోలలో విజయ్ ఒకరు. డైరెక్టర్ మురుగదాస్ కు – విజయ్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ‘స్పైడర్’ తదుపరి సినిమాను విజయ్ తోనే చేయబోతున్నారు మురుగదాస్. దీంతో ‘రోబో 2.0’ యూనిట్ అయిన రజనీ, శంకర్ లు కనుక అనివార్య కారణాల వలన మిస్ అయితే, విజయ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడంతో, మహేష్ తమిళ ఎంట్రీ అదిరిపోబోతుందన్నది స్పష్టం.

ADVERTISEMENT
Latest Stories