Chiranjeevi Rajinikanth

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుడు నుండి సెలబ్రెటీ వరకు అందరు వైసీపీ ప్రభుత్వ అవమానాలను ఎదురుకున్న వారే. ఇందులో మరి ముఖ్యంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ గా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ వైసీపీ నాయకుల చీత్కారాలకు తలొగ్గారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన రజనీకాంత్ ఆ సభలో తనకు చంద్రబాబు కు మధ్య ఉన్న స్నేహ సంబంధాన్ని వివరిస్తూ సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించిన ఒక విజనరీ నాయకుడు బాబు అంటూ కొనియాడారు. అయితే ఈ ఒక్క మాటతో వైసీపీ బూతుల మంత్రులందరూ కట్టకట్టుకుని మీడియా ముందుకొచ్చి వారి స్థాయికి మించి రజనీకాంత్ ను నానా మాటలు అన్నారు.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో తో ఇండస్ట్రీ నష్టాల బాట పడుతుందని దాని మీద మరోసారి పునరాలోచించాలంటూ టాలీవుడ్ పెద్దలు మెగా స్టార్ నేతృత్వంలో తాడేపల్లి ప్యాలస్ గడప తట్టారు. అయితే ఆ నెపంతో చిరంజీవి వంటి మెగా స్టార్ జగన్ ముందు చేతులు చాచేలా చేసి ఆ వీడియో బయట ప్రపంచానికి చూపిస్తూ ఎంతటి వాడైనా మా ముందు చేతులు చాచాల్సిందే అనే సందేశాన్ని పంపారు జగన్.

దీనితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్లు జగన్ ప్రభుత్వంలో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు సూపర్ స్టార్ లను తన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిధులుగా ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు. బాబు తో పాటుగా పవన్ కూడా అధికారంలో భాగస్వామి కావడంతో తన తమ్ముడు పవన కోసమైనా చిరు వచ్చి తీరుతారు.

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

కానీ బాబు తానే స్వయంగా చిరుకు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చూస్తుంటే విలువ తెలిసిన నాయకుడికి విధ్వంసాన్ని నమ్ముకున్న నాయుడికి తేడా స్పష్టంగా అర్ధమవుతుంది అంటున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే జగన్ దగ్గర అన్నకు జరిగిన అవమానాన్నీ జనసేన పోటీ చేసిన 21 కి 21 నెగ్గి వైసీపీ ని గద్దె దింపి తానూ పొందిన విజయాన్ని చిరు కాళ్ళ దగ్గర పెట్టి లెక్క సరిచేశారు పవన్.

ఇప్పుడు బాబు కూడా అదే తీరుగా జగన్ ప్రభుత్వంలో భంగ పడిన ఈ ఇద్దరు సెలబ్రెటీ సూపర్ స్టార్లను దేశ ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో వారికీ పెద్ద పిట్ట వేసి గతంలో జగన్ చేసిన అవమానానికి ఇప్పుడు న్యాయం చేయనున్నారు. బాబు తీసుకున్నఈ నిర్ణయంతో అటు చిరు అభిమానులతో పాటుగా ఇటు రజని అభిమానులు కూడా బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read – ఇలా కొట్టేవారెవరైనా ఉన్నారా..మళ్ళీ ఆయనే ట్రై చెయ్యాలా..?