మైండ్ బ్లాక్ చేస్తున్న ‘సూపర్ స్టార్’ సినిమా రైట్స్!

Rajinikanth Satellite Rights Sold - 110cr110 కోట్లు… అవును అక్షరాలా నూట పది కోట్లు. ఇదేదో ఒక సినిమాకు బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్ కాదు, అలాగే ఒక సినిమాకు ఖర్చు పెట్టిన బడ్జెట్ అంతకంటే కాదు. కేవలం ఒక సినిమాను బుల్లితెరపై ప్రదర్శించడానికి నిర్ణయించిన శాటిలైట్ హక్కుల ధర. మరి ఈ రేంజ్ లో శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయంటే అది ఖచ్చితంగా ‘సూపర్ స్టార్’ సినిమా అన్న విషయం అంచనా వేస్తే… అది నిజమే..! ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు రజనీకాంత్.

శంకర్ దర్శకత్వంలో రజనీ, అక్షయ్ కుమార్ లు నటిస్తున్న “రోబో 2.0” సినిమాను బుల్లితెరపై ప్రదర్శించేందుకు గానూ ‘జీ’ యాజమాన్యం ఏకంగా 110 కోట్లను ఖర్చు పెట్టింది. అయితే ఇది సింగిల్ లాంగ్వేజ్ కాదు, మూడు భాషలలో! తమిళ, తెలుగు, హిందీ భాషలకు గానూ ఇంత మొత్తాన్ని చెల్లించి, ‘జీ’ ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఇండియాలో శాటిలైట్ హక్కుల విషయంలో అత్యధిక ధరను అందుకున్న సినిమాగా ‘రోబో 2.0’ సరికొత్త చరిత్ర సృష్టించింది.

ADVERTISEMENT

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. వీడియో పరంగా ఒక చిన్న టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినప్పటికీ శాటిలైట్ హక్కుల డీల్, ఈ రేంజ్ లో జరగడంతో సినీ జనాలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. దీంతో శంకర్ – రజనీల కాంభినేషన్ పై ట్రేడ్ వర్గాల్లో ఎంత నమ్మకం, ఇంకెంత క్రేజ్ ఉందో అర్ధం అవుతోంది. తమిళ సంవత్సరాది కానుకగా తొలి టీజర్ ప్రేక్షకుల ముందుకు రావచ్చన్న టాక్ వినపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories