ప్రస్తుతం థమన్ ఇరగ్గోట్టేస్తున్నాడు. కొట్టడం అంటే అలా ఇలా కాదు… దొరికింది దొరికినట్టు దంచికొట్టుడు కొట్టేస్తున్నాడు. బహుశా ‘బ్యాక్ గ్రౌండ్’ కింగ్ అనిపించుకోవడానికి ఓ కంకణం కట్టుకున్నారేమో అన్న చందంగా, ఒకే సమయంలో డిఫరెంట్ జోనర్స్ సినిమాలకు బ్రహ్మాండమైన బ్యాక్ గ్రౌండ్ ను అందిస్తూ సంగీత ప్రియులను పిచ్చేక్కిస్తున్నాడు. తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “రాజు గారి గది 2” మోషన్ పిక్చర్ బ్యాక్ గ్రౌండ్ తో మరోసారి థమన్ పేరు మారుమ్రోగుతోంది.
అక్టోబర్ లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఎంత హైలైట్ గా నిలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారో, సంగీత దర్శకుడు థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ కూడా అంతే హైలైట్ కానుందన్న సంకేతాలను ఈ మోషన్ పిక్చర్ ఇచ్చింది. థమన్ ఇలాగే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్స్ కొట్టుకుంటూపోతే, ఆ మ్యూజిక్ కోసమైనా సినిమాకు క్యూలు కడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మిగతా సంగీత దర్శకులతో పోల్చుకుంటే, అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన మ్యూజిక్ ను అందించడం థమన్ స్పెషాలిటీ.


