వీళ్ళిద్దరి చుట్టూనే ప్రమోషన్స్!

Raju Gari Gadhi 2 latest poster with samantha ruth prabhuఅగ్ర హీరోల సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాలను చవిచూస్తున్న నేపధ్యంలో… ‘కింగ్’ నాగార్జున, సమంత ప్రధాన పాత్రలలో నటించిన “రాజు గారి గది 2” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను నాగార్జున ఇటీవల ప్రారంభించి తనయుడి వివాహానికి గోవా వెళ్ళగా, చిత్ర యూనిట్ దానిని కొనసాగిస్తూ, సినిమాపై అత్యంత ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తోంది.

ADVERTISEMENT

ఒకప్పటి బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి పార్ట్ చిన్న చిత్రంగా విడుదలై సక్సెస్ కావడం మరియు ఈ సీక్వెల్ లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ నటించడంతో… ఈ సెకండ్ పార్ట్ పై అంచనాలు బానే ఉన్నాయి. అయితే సినిమాకు ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే… మొదటి పార్ట్ లో ప్రమోషన్స్ అన్ని సినిమా కధ చుట్టూ తిరుగగా, తాజా సినిమాకు మాత్రం నాగ్, శ్యాంలపైనే ఆధారపడ్డారు.

ఈ పబ్లిసిటీ బహుశా ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడవచ్చు, అలాగే పబ్లిసిటీకి తగ్గట్లుగా సినిమాలో వీరిద్దరి మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటే, మరో బ్లాక్ బస్టర్ ఖాయం. అలా కాకుండా పెంచిన అంచనాలను అందుకోలేని పక్షంలో సినిమా ఫలితమే తారుమారయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందన్న విషయం చిత్ర యూనిట్ గమనించాలి. ట్రైలర్ లో కూడా వీరిద్దరి నడుమ వచ్చిన షాట్ హైలైట్ కాగా, ఇప్పుడు పోస్టర్స్ కూడా అదే బాటలో వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories