‘స్పైడర్’పై అంత నమ్మకమా?

Rakul Preet Singh confidence on Spyder movieమురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న “స్పైడర్” సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియోను 9వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతుండగా, రెండవ పాటను ఈ సోమవారం నాడు విడుదల చేయనున్నారు. ‘హోలీ హోలీ’అనే మాస్ నెంబర్ ప్రేక్షకులను పలకరించనుండగా, ఈ సినిమాతో తన ముచ్చట ఓ తీరిపోతుందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయ పడుతోంది.

తెలుగులో భారీ సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పటివరకు తమిళంలో మాత్రం విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయితే “స్పైడర్” సినిమాతో అది కూడా తీరిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ‘స్పైడర్’తో పాటు కార్తీ, సూర్యల సినిమాలలో కూడా నటిస్తుండడంతో, ఈ ఏడాది ఖచ్చితంగా తమిళనాట తన విజయపు జెండా ఎగురవేయడం ఖాయం అంటోంది రకుల్. ఈ మూడు సినిమాలలో కూడా ముందుగా విడుదల కానున్నది “స్పైడర్” సినిమానే.

ADVERTISEMENT

మరి ఈ సినిమా విజయంపై రకుల్ ప్రదర్శిస్తోంది విశ్వాసమో, అతి విశ్వాసమో తెలియాలంటే ఈ నెల 27వ తేదీ వరకు వేచిచూడాలి. అప్పటివరకు రకుల్ ఇతర సినిమాలను చూసే మూడ్ లో ఉన్నట్లుగా కనపడుతోంది. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను వీక్షించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాను దర్శకుడు చాలా నేర్పుగా తెరకెక్కించారని కితాబిచ్చింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక’ సినిమాలలో మంచి పాత్రలు పోషించి కీర్తి ప్రతిష్టతలు అందుకున్న రకుల్ కు ‘స్పైడర్’ ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories