కింగ్ నాగార్జున మన్మథుడు మూవీ ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ లో కామెడీ ఛాయలు ఎక్కువగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్. నాగ్ సీనియర్ హీరో. సీనియర్ హీరోలతో కలిసి పనిచేయడానికి కుర్ర హీరోయిన్లు పెద్దగా లైక్ చేయరు. కారణం ఏంటి అంటే… సీనియర్ హీరోలతో కలిసి పనిచేస్తే కెరీర్ ముగిసిపోయినట్టే అనే టాక్ వస్తుందని.
అలాగే సీనియర్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే అవకాశాలు వస్తాయని అనుకుంటారని కొంత టాక్ ఉంది. అదే సమయంలో ఇటీవలే రకుల్ నాగార్జున కుమారుడు నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాంలో హీరోయిన్ గా చేసింది. స్పైడర్ డిజాస్టర్ తరువాత రకుల్ కు ఇక్కడ అవకాశాలు లేవు. ఈ క్రమంలో నాగార్జున వంటి సీనియర్ హీరో పక్కన చెయ్యడం అంటే సాహసమే. అయితే ఈ సాహసం చెయ్యడానికి రకుల్ కు బానే ముట్టిందని వార్తలు వస్తున్నాయి.
అందుకే రకుల్ అవేమి పట్టించుకోకుండా నాగార్జునతో మన్మధుడు 2 లో నటించేందుకు ఒకే చెప్పిందట. దీనికోసం ఆమె ఏకంగా కోటి యాభై లక్షల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈ స్థాయిలో రకుల్ రెమ్యునరేషన్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. అయితే చాలా మంది మాత్రం కేరీర్ లో బాగా లో లో ఉన్న సమయంలో రకుల్ కి ఇంత ముట్టింది అంటే నమ్మలేం అంటున్నారు. మరోవైపు ఈ మూవీ తరువాత తిరిగి కెరీర్ గాడిలో పడుతుందని అంటోంది రకుల్.



