శూర్పణఖ పాత్రలో మరో కోణమా.. ఏమిటబ్బా అది?

Rakul Preet Singh as Surpanakha

రామాయణంలో ప్రతీ పాత్ర గురించి భారతీయులందరికీ తెలుసు. శూర్పణఖ శ్రీరాముడిని మొహించినందుకు లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు, చెవులు కోయడం, ఆమె లంకకు తిరిగివెళ్ళి అన్న రావణాసురుడుకి మొర పెట్టుకోవడం, ప్రతీకారం తీర్చుకునేందుకు రావణుడు సీతని ఎత్తుకుపోవడం, రావణ వధ కథ అందరికీ తెలిసిందే.

కానీ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ మొదటి భాగంలో అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

“ఎందుకు?” అని అడిగితే, “శూర్పణఖ పాత్ర చాలా సంక్లిష్టమైనది. ఆ పాత్రలో వేరే కోణం కూడా ఉంది. అందుకే నేను ఒప్పుకున్నాను,” అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది.

శూర్పణఖ పాత్ర చేసేందుకు ఆమె వంటి స్టార్ హీరోయిన్‌ ఒప్పుకున్నందున, లేదా ఆమెను ఒప్పించేందుకు దర్శకుడు నితీష్ తివారీ ఆ పాత్రకి కొత్తగా ఏవైనా ‘యాడ్ ఆన్‌’ చేస్తున్నారా? అని ఆమె అనుమానం కలిగించారు.

ఇదివరకు తెలుగులో ఎన్టీఆర్ రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు, కర్ణుడు వంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినప్పుడు తన నటనతో మెప్పించారు. వాటి ఔచిత్యం పెంచి అందరినీ ఒప్పించగలిగారు.

అలాగే తెలుగు సినిమాలలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడు, శివుడు, యమధర్మరాజు, ఇంద్రుడు వంటి అనేక పౌరాణిక పాత్రలను భిన్నంగా చూపి మెప్పించారు. కానీ ఎవరూ శూర్పణఖ పాత్రని ఎవరూ మార్చలేదు. అందరికీ తెలిసిన విధంగానే ఆమెని చూపారు.

కనుక ఆమె పాత్రలో సంక్లిష్టత, వేరే కోణం ఏమిటో దీపావళినాడు రామాయణ మొదటి భాగం విడుదలైతేనే తెలుస్తుంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కోసం లేదా సినిమా కోసం కొత్త ప్రయోగాలు చేస్తే చెయ్యి కాలే ప్రమాదం కూడా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories