అంతలేదు… అయినా థాంక్స్ చెప్పిన హీరోయిన్..!

Rakul Preeth Singh injured -shoting Mahesh babu movie  మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలతో సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా జరుపుతున్న ఈ యాక్షన్ దృశ్యాల షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గాయపడిందని, ఆమె వేలు విరిగిందనే వార్తలు వచ్చాయి.

దీంతో రకుల్ అభిమానులతో పాటు సినీ వర్గాలకు చెందిన వారు ‘ఎలా ఉందంటూ’ వాకబు చేయడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అందరికీ స్పష్టత ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. “తన వేలు విరగలేదని, కేవలం బెణికిందని, అయినా తాను కోలుకోవాలంటూ అభిమానుల చేసిన మెసేజ్ లకు తన ధన్యవాదాలు” తెలిపింది. అయితే రకుల్ ఇంజురీ వార్త ఒక్క అభిమానులనే కాక, ఇప్పటికే ఈ చక్కనమ్మ ఒప్పుకుని ఉన్న ఇతర సినిమాల దర్శకనిర్మాతలను కూడా కంగారుపెట్టి ఉంటుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories