బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పై మెగా అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగగా, చివరికి “వినయ విధేయ రామ్” అని ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇదే పేరును ఈ దసరాకు అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం కూడా జరిగింది.
ADVERTISEMENT
[m9ad]
కానీ మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం దీపావళికి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీపావళి సందర్భంగా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో మెగా అభిమానులు దివాళి వరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ADVERTISEMENT



