మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..మెగా తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తోలి రోజుల్లో వరుసగా హిట్స్ అయితే ఇచ్చాడు కానీ..నటన పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కున్నాడు..అయితే అది సర్వ సాధారణమే…ఎందుకంటే మెగాస్టార్ లాంటి హీరో వారసుడు అంటే ఎక్సపెక్టషన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి…
[m9ad]
కట్ చేస్తే చెర్రీలో ఉన్న నటుణ్ని నిద్ర లేపే పాత్ర మాత్రం చెర్రీకి…చిట్టి బాబు రూపంలోనే వచ్చింది అని చెబితే అతిశయోక్తి కాదు…2018 లో చిట్టిబాబుగా రంగస్థలంలో తన నట విశ్వరూపం చూపించిన చెర్రీ..తనపై వచ్చిన విమర్శలకు అన్ని విధాలుగా చెక్ పెట్టేశాడు.
ఒక పక్క సినిమా పరంగా భారీ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో సైతం చేరిపోయాడు. ఇక చెవిటి వాడి పాత్రని ఎత్తుకుని భారీ ప్రయోగమే చేసాడు..స్టార్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆ పాత్ర ఒప్పుకోవడమే గొప్పతనం అంటే…ఇక ఆ పాత్రతో టాలీవుడ్ రికార్డులను దుమ్ము దులిపేసాడు చెర్రీ..
మొత్తంగా చూసుకుంటే మెగా పవర్ స్టార్ అన్న పదానికి చెర్రీ తన నటనతో జస్టిఫికేషన్ ఇచ్చి..మరోసారి ఆయనపై ఎవరైనా విమర్శలు చెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు చెక్ చేఉకునే విధంగా సమాధానం చెప్పాడు..
ఎంతైనా మెగాస్టార్ వారసుడు కదా…ఆ మాత్రం ఉండకపోతే ఎలా?



