చరణ్ వల్ల కాలేదు… నెక్స్ట్ చిరునా…? పవనా..?

ram-charan-fails-to-beat-jr-ntrసినీ పరిశ్రమలో మెగా హీరోల ఆధిపత్యానికి బ్రేక్ లు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం ట్రేడ్ వర్గాల నుండి లభిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ పుణ్యమా అంటూ ఇప్పటికే టాప్ 3లో స్థానం కోల్పోయిన మెగా హీరోలు ‘ధృవ’ టీజర్ రికార్డులపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన ఈ సినిమా టీజర్, అంతకు ముందున్న యూ ట్యూబ్ రికార్డులన్నీ కొల్లగొడుతుందని అభిమానులు భావించారు. అయితే ఆ రికార్డులను అందిపుచ్చుకోవడంలో ‘ధృవ’ విఫలమైంది.

నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ టీజర్ ను బాగా కట్ చేసారు. స్టైలిష్ మేకింగ్ తో సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ఇంత బాగుంది కాబట్టే… తెలుగులో యూ ట్యూబ్ ఆల్ టైం రికార్డులను బద్దలు కొడుతుందని అభిమానులు అంచనా వేసారు. కానీ, 24 గంటలు పూర్తయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ రికార్డును చెర్రీ అందుకోకపోవడంతో, మెగా అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. సోషల్ మీడియాలో ‘ధృవ’ ప్రచారం కోసం కొత్త పుంతలు తొక్కినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ADVERTISEMENT

అయితే రామ్ చరణ్ వల్ల కాకపోవడంతో… మరో మెగా హీరో ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ మెగా మూవీ టీజర్ వస్తే ఖచ్చితంగా అన్ని రికార్డులను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, మెగాస్టార్ సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. దీంతో చిరు సినిమా టీజర్ కు స్పందన ఎలా ఉంటుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. చిరు వల్ల కూడా కాకపోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” ఆ పనిని పూర్తి చేస్తారని అభిమానులు నమ్ముతున్నారు. అయితే వీరిద్దరూ కాక, మధ్యలో మహేష్ బాబు కొట్టినా కొట్టవచ్చు.

ADVERTISEMENT
Latest Stories