పిక్ టాక్ – నేనొస్తున్నా అంటున్న రామ్ చరణ్!

Ram Charan, Ram Charan Leaked Police Look Dhruva Movie, Ram Charan Leaked Cop Look Dhruva Movie, Ram Charan Leaked Stylish Look Dhruva Movieవరుస వైఫల్యాలతో అభిమానులను నిరాశలో పడేసిన మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పలు స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేయగా, చెర్రీ కొత్త లుక్ ని చేసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే అధికారికంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి రాబోతున్న రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్న మరో స్టిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. రెండు చేతులు జేబులో పెట్టుకుని స్టైల్ గా నడుచుకుని వస్తున్న చెర్రీ ఫోటో, స్పష్టంగా లేకపోయినప్పటికీ, రామ్ చరణ్ స్టైల్ మాత్రం అభిమానులను ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT

మరికొద్ది రోజుల్లోనే ‘ధ్రువ’ ఫస్ట్ లుక్ రూపంలో ‘నేనోస్తున్నాను’ అన్నట్లుగా ఉన్న ఈ స్టిల్ ప్రస్తుతం మెగా అభిమానుల్లో సర్క్యూలేట్ అవుతోంది. పోలీస్ డ్రెస్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ ఇవ్వగా, చెర్రీకి మాత్రం ‘తుఫాన్’ రూపంలో భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. మళ్ళీ ఆ స్థాయి ఫలితం మాత్రం రాకూడదు అని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ADVERTISEMENT
Latest Stories