‘మొగల్తూరు మొనగాడు’గా రామ్ చరణ్?

Ram charan Next Project with sukumar 'Mogalthur Monagadu'మొగల్తూరు ఊరు చెప్పగానే మరో మాట లేకుండా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఒక సాధారణ పల్లెటూరు నుండి వచ్చిన చిరు, సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. అయితే మొగల్తూరు నుండి వచ్చి ఇంతగా ఎదిగిన చిరంజీవి, పుట్టిన ఊరుకు మాత్రం ఏమీ చేయలేదన్న అసంతృప్తి స్థానిక వాసుల్లో వ్యక్తమైన విషయాలు ‘ప్రజారాజ్యం’ ప్రచారం సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. ఆ కారణాలతో అప్పటి సార్వత్రిక ఎన్నికలలో చిరు సొంత ఊరిలోనే ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నది బహిర్గత విషయమే.

అంత నెగటివ్ అభిప్రాయం గల ‘మొగల్తూరు’ను, తాజాగా చిరు తనయుడు రామ్ చరణ్ తన కొత్త చిత్రానికి టైటిల్ గా వినియోగించుకోబోతున్నారన్న టాక్ హల్చల్ చేస్తోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ – చెర్రీ కాంభినేషన్ లో పల్లెటూరు ప్రేమకధగా తెరకెక్కించనున్న సినిమాకు ‘మొగల్తూరు మొనగాడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ ఫేం మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న తెలిసిందే.

ADVERTISEMENT

గతంలో ‘పల్లెటూరు ప్రేమలు, పల్లెటూరి మొనగాడు’ వంటి టైటిల్స్ ను పరిశీలించగా, అవి మరీ పాత కాలం నాటివిగా ఉండడంతో, మాస్ మరియు మెగా అభిమానులను మెప్పించేలా ‘మొగల్తూరు మొనగాడు’ పేరు పెడితే బాగుంటుందన్న టాక్ వినపడుతోంది. గతంలో కృష్ణ సొంతూరు ‘బుర్రిపాలెం బుల్లోడు’గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. మరి అదే బాటలో కూడా రామ్ చరణ్ కూడా పయనిస్తాడో లేదో తెలుసుకోవాలంటే అధికారిక సమాచారం వెలువడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories