‘బ్లడీ బోల్డ్’ సినిమా అన్న రామ్ చరణ్!

Ram Charan Praises Arjun Reddy Movieబాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ విమర్శకులతో పాటు టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలను సైతం బుట్టలో పడేసిన ఈ సినిమా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫిదా అయ్యారన్న విషయం ఫేస్ బుక్ వేదికగా బయటపడింది. ఈ సినిమాను చూసానంటూ రామ్ చరణ్ ఫేస్ బుక్ వేదికగా తన భావాలను పంచుకున్నారు.

ADVERTISEMENT

“రా, రియలిస్టిక్, బ్లడీ బోల్డ్… హ్యాట్సాఫ్ టు సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ మరియు టీం మొత్తానికి…” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఫీలింగ్ హ్యాపీ’ అనే ఏమోజీని కూడా పంచుకున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్ టాప్ హీరోలంతా ప్రశంసలు కురిపిస్తుండడంతో, బహుశా సందీప్ వంగాకు టాలీవుడ్ లో అవకాశాలు ఓ రేంజ్ లో వచ్చిపడేటట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories