సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న బిగ్ మూవీ!

Ram Charan Rangasthalam 1985 postpone2018 సంక్రాంతి పండగ సినీ అభిమానులకు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్న సంకేతాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బరిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, బాలకృష్ణల సినిమాలు ఉంటాయన్న టాక్ వెలువడగా, ఈ నాలుగింటిలో చెర్రీ నటిస్తోన్న “రంగస్థలం 1985” ఒక్కడే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించారు. పవన్ సినిమాపై ప్రకటన వెలువడాల్సి ఉండగా, మహేష్, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యే విధంగా షూటింగ్ కు ప్రణాళికలు సిద్ధం చేసామని మేకర్స్ చెప్పారు.

ADVERTISEMENT

అయితే ట్విస్ట్ ఏమిటంటే… ఇప్పటివరకు ఏ సినిమా అయితే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని భావించారో, అదే సినిమా ఇప్పుడు వెనక్కి వెళ్ళిందనేది ట్రేడ్ లేటెస్ట్ టాక్. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న “రంగస్థలం 1985” సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుందని సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోన్న విషయం. అయితే ఇందులో ఎంత వాస్తవముందో తెలియదు గానీ, చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రొడక్షన్ పనుల కారణంతో, చెర్రీ తన సినిమా షూటింగ్ ను కొంతకాలం పక్కన పెట్టారనేది దీని ఆంతర్యం.

వాస్తవానికి అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ ముగిసే విధంగా ప్లానింగ్ జరిగింది. ఆ తర్వాత సుకుమార్ మార్క్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి డిసెంబర్ నాటికే ఫస్ట్ కాపీని సిద్ధం చేయాలనేది మేకర్స్ ఆలోచన. గడిచిన షెడ్యూల్ వరకు కూడా అంతా ఇలాగే జరిగింది. కానీ తాజా షెడ్యూల్ లోనే కొంత ఆలస్యం అవుతోందని, అది కూడా చిత్ర హీరో రామ్ చరణ్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనేనని తెలియడంతో, సంక్రాంతికి ఉన్న పోటీ రీత్యా, కాస్త వెనక్కి వెళ్లి ఫిబ్రవరి నాటికి సిద్ధం కావాలనేది లేటెస్ట్ ఐడియాగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories