అసలు సిసలు గ్రామీణ వాతావరణంలో “రంగస్థలం” సినిమా తెరకెక్కుతోందన్న సమాచారానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ లేటెస్ట్ ఫోటో. రాజమండ్రిలో నేటి నుండి ప్రారంభమైన మలి షెడ్యూల్ లో భాగంగా జరుగుతోన్న షూటింగ్ లో ఎర్ర చొక్కా, పూల లుంగీ కట్టుకుని పొలం గట్ల మీద తిరుగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో అప్పుడే ఊర్చిన ధాన్యపు పొలాలను కుప్పలుగా చేర్చి ఉన్న వాతావరణం సహజత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ధాన్యం చేరవేసేందుకు గతంలో ట్రాక్టర్లు కాకుండా ఎడ్ల బండ్లు వినియోగించేవారు. 1985 నాటి కాలం కధ కాబట్టి అందుకు తగిన విధంగా టైరు ఎడ్ల బండ్లు కాకుండా చక్రాల ఎడ్ల బండ్లు వినియోగించడం అనేది ఈ సినిమాను ఎంత సీరియస్ నెస్ గా తీస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రామ్ చరణ్ ను చూసిన ఆనందంలో ఓ అభిమాని క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ‘హాయ్’ అంటూ రామ్ చరణ్ పలకరించిన విధానం కూడా ఈ ఫోటోలో కనపడుతోంది.



