రామ్ గోపాల్ వర్మ లో కొత్త మార్పు…కారకులెవరో.?

Ram Gopal Varma Apologizes to Chiranjeevi, Fans Surprised

గతకొన్నేళ్ళుగా బూతు సినిమాలు తీస్తూ, రోత రాజకీయాలు చేస్తూ, సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులతో అందరి సహనాన్ని పరీక్షించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు, వింతగా వినిపిస్తున్నారు.

కొన్నేళ్లుగా వైసీపీ ట్రాక్ ఎక్కిన వర్మ అందుకు తగ్గట్టే వైసీపీ కి అనుకూలంగా చిత్రాలను తెరకెక్కించి, జగన్ ను మెప్పించేలా బాబు, లోకేష్, పవన్ ల పై సోషల్ మీడియాలో హీనమైన పోస్టులు చేసి, మెగా కుటుంబం పై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ అటు టీడీపీ – జనసేనలతో పాటుగా ఇటు మెగా అభిమానులను సైతం తన చర్యలతో రెచ్చకొట్టారు వర్మ.

ADVERTISEMENT

అటువంటి వర్మ శివ రీ రిలీజ్ సందర్భంగా చాల కొత్తగా కనిపిస్తున్నారు. అక్కినేని నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ శివ 36 సంవత్సరాల తరువాత రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆ మూవీ టీం కి పలువురు సినీ సెలబ్రెటీలు శుభాకంక్షలు తెలియచేసారు.

అందుకు దర్శక ధీరుడు రాజమౌళి, లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ వంగా, పాన్ సూపర్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాటుగా మెగా స్టార్ చిరంజీవి సైతం ఉన్నారు.

అయితే ఆర్జీవీ వైస్ మెగా కుటుంబం అన్నట్టుగా రాంగోపాల్ వర్మ పరిస్థితులను మార్చేసిన ఈ నేపథ్యంలో చిరు శివ సినిమాను అభినందిస్తూ ఆ చిత్ర దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ పై ప్రశంసలు కురిపించారు.

టాలీవుడ్ సినీ చరిత్రలో శివ సినిమా ఒక చిరంజీవిగా ఉండిపోతుందంటూ చిరు చేసిన వ్యాఖ్యలకు, ఆర్జీవీ పై చేసిన ప్రశంసలకు గాను వర్మ తన సోషల్ మీడియా వేదిక గా మొట్టమొదటి సరిగా మెగా స్టార్ చిరంజీవి పై సానుకూలమైన పోస్టు ను షేర్ చేసారు.

మీ విశాల హృదయానికి ధన్యవాదాలు అంటూనే చిరుకి క్షమాపణలు తెలిపారు. దీనితో అసలు వర్మ కు ఏమైంది.? సడెన్ గా చిరు పై ఈ స్థాయి ప్రేమకు కారణమేంటి.? అంటూ వర్మ పై అటు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే శివ రీ రిలీజ్ సందర్భంగా జరిగే మూవీ ప్రమోషన్స్ లో సైతం మీడియా మిత్రులు వర్మ పై ఇటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఈ విషయం పై స్పందించేందుకు వర్మ సానుకూలంగా లేరు. తానూ చెప్పదలచుకున్నది తన X వేదికగా ఇప్పటికే చెప్పానంటూ మాటదాటేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చికిరి చికిరి చిక్కి పాట పై కూడా వర్మ తన X లో పాజిటివ్ కామెంట్స్ చేసారు. చాల కాలం తరువాత రామ్ చరణ్ ను ఇటువంటి రా లుక్ లో చూడడం, భారీ భారీ సెట్లు, వందలమంది డాన్సర్లతో కాకుండా రామ్ చరణ్ ను ఇలా ప్రజంట్ చేయడం బాగుందంటూ పెద్ది దర్శకుడు బుచ్చిబాబు ను అభినందించారు ఆర్జీవీ.

ఒకప్పుడు మెగా ఫ్యామిలి హీరోల పై, వారి సినిమాల పై వెటకారం తో విరుచుకుపడిపోయిన వర్మ ఇప్పుడు ఇలా ఇద్దరు మెగా హీరోల పట్ల అందునా చిరు, ఆతని కుమారుడి పట్ల ఇటువంటి పాజిటివ్ కామెంట్స్ చెయడం, చిరుకి క్షమాపణలు చెప్పడం చూస్తుంటే వర్మలో వచ్చిన ఈ మార్పు కి కారకులెవరు.? అంటూ ఆలోచనలో పడ్డారు మెగా అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories